అదృష్టాన్ని తెచ్చిపెట్టే జాతిర‌త్నాలు

జాత‌కాలు చూపించుకున్న‌ప్పుడు అదృష్టం, స‌క్సెస్ రావాల‌ని కొన్ని ర‌కాల జాతి ర‌త్నాల‌ను (gem stones) పెట్టుకోమ‌ని సూచిస్తుంటారు. అస‌లు ఎలాంటి జాతి ర‌త్నాలు పెట్టుకుంటే ల‌క్ క‌లిసొస్తుందో.. ఎవ‌రు పెట్టుకోవాలో తెలుసుకుందాం.

వ‌జ్రం (diamond)

వ‌జ్రం కాన్ఫిడెంట్‌గా మారుస్తుంది. స‌మాజంలో గుర్తింపు, కెరీర్‌లో ఎదుగుద‌ల కోసం ప్ర‌య‌త్నిస్తున్న వారికి వ‌జ్రం బాగుంటుంది. మ‌నిషి జీవితాన్ని నాశ‌నం చేసేది కోపం. ఆ కోపాన్ని నియంత్రించే శక్తి వ‌జ్రానికి ఉంటుంది.

క‌న‌క పుష్య‌రత్నం (yellow sapphire)

ఈ ర‌త్నం ధ‌రిస్తే మ‌న‌ల్నే డ‌బ్బు వెతుక్కుంటూ వ‌స్తుంద‌ట‌. వ్యాపారం చేసేవారు ఎక్కువ‌గా ఈ ర‌త్నాన్నే ధ‌రిస్తారు. అవ‌కాశాలు మ‌న‌ల్నే వెతుక్కుంటూ వ‌స్తాయి.

మ‌ర‌క‌తం (emerald)

జీవితంలో చేసే ప‌నిలో సృజ‌నాత్మ‌క‌త కోరుకునేవారికి ఈ మ‌ర‌క‌తం బాగా ప‌నిచేస్తుంది. స‌క‌ల సంప‌ద‌ల‌ను క‌లిగిస్తుంది. జీవితం ఎటుపోతోందో తెలీని వారికి ఇది బాగా ప‌నికొస్తుంది.

ప‌గ‌డం (red coral)

అస‌లు జీవితంలో ఏం చేయాల‌న్నా కూడా ఆస‌క్తి రావ‌డంలేదా? అయితే ప‌గ‌డం బాగా ప‌నిచేస్తుంది. ప‌గ‌డం ఉంగ‌రం మ‌నిషికి ఆలోచ‌న‌ల‌ను పుట్టిస్తుంది. జీవితంలో ఏద‌న్నా చేయాల‌న్న ఆలోచ‌న‌ను క‌లిగిస్తుంది.

గ‌మ‌నిక‌: ఈ జాతిర‌త్నాల‌ను ఎలా ప‌డితే అలా పెట్టుకోవ‌డానికి లేదు. మీ జాత‌క ప్ర‌కారం జ్యోతిష్య నిపుణులు సూచిస్తేనే పెట్టుకోవాలి. ఇలాంటి విష‌యాల్లో నిర్ణ‌యం తీసుకునే ముందు నిపుణుల‌ను సంప్ర‌దించాలి