April 12 Rasi Phalalu: ఈ రాశివారికి ఉద్యోగ అవ‌కాశాలు.. మీ రాశి ఎలా ఉందో చూసుకోండి

April 12 Rasi Phalalu:: క్రోధి నామ సంవ‌త్స‌రం, చైత్ర మాసం, శుక్ల ప‌క్షం, ఉత్త‌రాయ‌ణం, వ‌సంత రుతువు, చ‌వితి, రోహిణి న‌క్ష‌త్రం. ఈరోజు (ఏప్రిల్ 12) రాశిఫ‌లాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.

మేష రాశి (Aries)

కుటుంబ వ్య‌వ‌హారాల విష‌యంలో నిర్ణ‌యాలు మార్చుకుంటారు. దీర్ఘ‌కాలిక అనారోగ్య స‌మ‌స్య‌ల నుంచి ఉప‌శ‌మ‌నం క‌లుగుతుంది. ఇత‌రుల నుంచి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. చేప‌ట్టే ప‌నుల్లో అవ‌రోధాలు అధిగ‌మిస్తారు. వ్యాపార‌, ఉద్యోగాలు య‌థావిథిగా సాగుతాయి.

వృష‌భ రాశి (Taurus)

ఇంటా, బ‌య‌టా అనుకూల ప‌రిస్థితులు ఉంటాయి. నూత‌న కార్య‌క్ర‌మాలు చేప‌డ‌తారు. స‌న్నిహితుల‌తో సంతోషంగా గ‌డుపుతారు. స్నేహితుల‌తో క‌లిసి విహార‌యాత్ర‌ల‌కు వెళ్తారు. చేప‌ట్టే ప‌నుల్లో విజ‌యం మీదే. వృత్తి, వ్యాపారాలు లాభ‌సాటిగా సాగుతాయి.

మిథున రాశి (Gemini)

రుణ‌, మాన‌సిక స‌మ‌స్య‌లు ఉంటాయి. ఆధ్యాత్మిక చింత‌న పెరుగుతుంది. బంధు మిత్రులతో మ‌న‌స్ప‌ర్ధ‌లు వ‌స్తాయి. రుణాల కోసం ప్ర‌య‌త్నిస్తారు. ప్ర‌యాణాల్లో ఇబ్బందులు క‌లుగుతాయి. వ్యాపార, ఉద్యోగాల్లో నిరుత్సాహం ఉంటుంది.

క‌ర్కాట‌క రాశి (Cancer)

నిరుద్యోగులు శుభ‌వార్త‌లు వింటారు. ప్ర‌యాణాల్లో కొత్త ప‌రిచ‌యాలు ఏర్ప‌డ‌తాయి. వ్యాపార విస్త‌ర‌ణ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. పాత మిత్రుల క‌ల‌యిక ఆనందాన్నిస్తుంది. నూత‌న వాహ‌నం కొనుగోలు చేస్తారు. ఉద్యోగాల్లో పురోగ‌తి క‌నిపిస్తుంది.

సింహ రాశి (Leo)

చేప‌ట్టిన ప‌నుల‌ను స‌కాలంలో పూర్తి చేస్తారు. కుటుంబంలో జ‌రిగే శుభ‌కార్యాల‌కు హాజ‌ర‌వుతారు. ముఖ్య‌మైన వ్య‌వ‌హారాల్లో స‌న్నిహితుల సాయం అందుతుంది. వృత్తి వ్యాపారాల్లో అంచ‌నాలు అందుకుంటారు. ఉద్యోగంలోని చిక్కుల‌ను అధిగ‌మిస్తారు.

క‌న్యా రాశి (Virgo)

ఆప్తుల ద్వారా కొత్త విష‌యాలు తెలుసుకుంటారు. నిరుద్యోగుల‌కు ఉద్యోగ అవ‌కాశాలు ఉంటాయి. కొన్ని ప‌నుల వ‌ల్ల స‌మ‌స్య‌లు తొల‌గి ఉప‌శ‌మ‌నం ల‌భిస్తుంది. ఆధ్యాత్మిక సేవా కార్యక్ర‌మాల‌కు ఆహ్వానాలు అందుతాయి. వ్యాపారాలు లాభాల బాట ప‌డ‌తాయి.

తుల రాశి (Libra)

ధ‌న‌, వ‌స్తు, వాహ‌న సౌఖ్యాలు ఉన్నాయి. సంఘంలో పెద్ద‌ల నుంచి విశేష‌మైన ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. వివాదాల నుంచి తెలివితేట‌ల‌తో బ‌య‌ట‌ప‌డ‌తారు. వ్యాపారాల‌లో ఆశించిన ఫ‌లితాలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగాల‌లో ఉన్న‌త అవ‌కాశాలు ల‌భిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio)

చేప‌ట్టిన కార్య‌క్ర‌మాల‌లో అవాంత‌రాలు ఏర్ప‌డ‌తాయి. ఆక‌స్మిక ప్ర‌యాణ సూచ‌న‌లు ఉన్నాయి. వృత్తి, ఉద్యోగాల్లో చికాకులు పెరుగుతాయి. వ్యాపారాల్లో తీసుకున్న నిర్ణ‌యాల వ‌ల్ల కొన్ని ఇబ్బందులు వస్తాయి. ఆర్థిక వ్య‌వ‌హారాలు నిరుత్సాహ‌ప‌రుస్తాయి.

ధ‌న‌స్సు రాశి (Sagittarius)

ఇంటా బ‌య‌టా ప్ర‌తికూల వాతావ‌ర‌ణం నెల‌కొంటుంది. వృత్తి, ఉద్యోగాల‌లో స్వ‌ల్ప మార్పులు ఉంటాయి. రుణ ప్ర‌య‌త్నాలు అనుకూలించ‌వు. దూర ప్ర‌యాణంలో వాహ‌న ఇబ్బందులు ఉంటాయి. ఆరోగ్యం విష‌య‌మై వైద్య స‌హాయం అవ‌స‌రం అవుతుంది.

మ‌క‌ర రాశి (Capricorn)

స్థిరాస్థి లాభం క‌లుగుతుంది. చేప‌ట్టిన ప‌నులు నిదానంగా పూర్తిచేస్తారు. వ్యాపార వ్య‌వ‌హారాల‌లో నూత‌న ఒప్పందాలు చేసుకుంటారు. దైవారాధ‌న వ‌ల్ల శుభ ఫ‌లితాలు క‌లుగుతాయి. వృత్తి, వ్యాపారాల‌లో అనుకూల ఫ‌లితాలు క‌లుగుతాయి.

కుంభ రాశి (Aquarius)

ముఖ్య‌మైన ప‌నుల‌లో కావాల్సిన వారి స‌హాయ స‌హ‌కారాలు అందుతాయి. ఆత్మీయుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార‌, ఉద్యోగాల‌లో మ‌రింత మెరుగైన ప‌రిస్థితులు ఉంటాయి. సంతాన విద్య విష‌యాలు సంతృప్తి క‌లుగుతాయి.

మీన రాశి (Pisces)

వ్యాపార, ఉద్యోగాలు నిరుత్సాహాన్ని క‌లిగిస్తాయి. ఆక‌స్మిక ధ‌న వ్య‌య సూచ‌న‌లు ఉన్నాయి. ఆరోగ్యం మంద‌గిస్తుంది. ముఖ్య‌మైన ప‌నులు వాయిదా వేయ‌డం మంచిది. కుటుంబ వ్య‌వ‌హారాల‌లో ఆలోచ‌న‌లు స్థిరంగా ఉండ‌వు. ప‌నులు మంద‌కొండిగా సాగుతాయి.