Sri Krishna Devarayalu: YSRCPని ఓడించడం అంత సులువేం కాదు
Sri Krishna Devarayalu: తెలుగు దేశం పార్టీ.. జనసేన, భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకున్నప్పటికీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని ఓడించడం అంత సులువేం కాదని అన్నారు YSRCP నుంచి తెలుగు దేశం పార్టీలోకి వెళ్లిన లావు శ్రీకృష్ణదేవరాయలు. నరసారావుపేట నుంచి పోటీ చేస్తున్న శ్రీకృష్ణదేవరాయలు ఇలాంటి వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశంగా మారాయి. ఈసారి గెలవాలంటే తెలుగు దేశం పార్టీ కూటమితో కలిసి అలుపెరుగని పోరాటం చేయాల్సిందేనని తెలిపారు. దీనిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ స్పందిస్తూ.. ఆల్రెడీ తెలుగు దేశం పార్టీ వాళ్లకు భయం మొదలైపోయింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ:
Ambati Rayudu: జనసేన జెండా పట్టుకుని రోడ్డుపై నిలబడమంటారా?