KCR: అడగకుండా ఏం చేస్తున్నారు.. గడ్డి పీకుతున్నారా?
Telangana Elections: ఎన్నికలు దగ్గరపడుతున్న నేపథ్యంలో సీఎం KCR ప్రచార కార్యక్రమాల జోరు పెంచారు. ఈరోజు ఆదిలాబాద్‌లోని బోథ్ (boath) ప్రాంతంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో పాల్గొన్నారు. అనిల్ జాదవ్‌ని (anil jadhav) గెలిపించాలంటూ ప్రజలను కోరుతూ BJP నేతలపై పంచ్‌లు వేసారు.
కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా దాదాపు 600 నవోదయ పాఠశాలలను తెరిచింది కానీ తెలంగాణకు మాత్రం ఒక్క విశ్వవిద్యాలయాన్ని కానీ పాఠశాలను కానీ ఇవ్వలేదని.. బోథ్ ప్రాంతంలోనే నలుగురు BJP నేతలు ఉన్నప్పుడు ప్రజలు ఇది కావాలి అని ప్రధాని నరేంద్ర మోదీని (narendra modi) అడగకుండా గడ్డి పీకుతున్నారా అని మండిపడ్డారు. నాలుగేళ్ల పాటు ఏమీ చేయకుండా ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని మళ్లీ ఓట్లు అడగటానికి వచ్చారని ప్రశ్నించారు. కాంగ్రెస్, BJPల వల్ల రాష్ట్రానికి పెద్ద ప్రమాదం రాబోతోందని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పిలుపునిచ్చారు. ఓటు ప్రజల తలరాత మారుస్తదని.. ఆ ఓటును జాగ్రత్తగా వినియోగించుకోవాలని చెప్పారు.