ముళ్ల పంది, ద‌రిద్రుడా.. అమిత్ షాపై రెచ్చిపోయిన అద్దంకి ద‌యాక‌ర్

addanki dayakar vulgar comments on amit shah

Addanki Dayakar: కాంగ్రెస్ నేత అద్దంకి ద‌యాక‌ర్ కేంద్ర మంత్రి అమిత్ షాపై (Amit Shah) వ‌ల్గ‌ర్ కామెంట్స్ చేసారు. ముళ్ల పంది, ద‌రిద్రుడా అంటూ రెచ్చిపోయారు. ఈసారి ఎన్డీయే కూట‌మి అధికారంలోకి వ‌స్తే ముస్లింల‌కు ఉన్న నాలుగు శాతం రిజ‌ర్వేష‌న్‌ను తీసేస్తామ‌ని భార‌తీయ జ‌న‌తా పార్టీ ప్ర‌క‌టించింది. ఈ నేప‌థ్యంలో అద్దంకి ద‌యాక‌ర్ దానిపై స్పందిస్తూ.. ముస్లింల‌కు రిజ‌ర్వేష‌న్లు ఎత్తేసి రాజ్యాంగాన్ని మార్చేస్తాన‌ని చెప్పిన ముళ్ల పంది, ద‌రిద్రుడు అమిత్ షా అంటూ నిప్పులు చెరిగారు. రాజ్యాంగాన్ని మార్చేస్తే భార‌తీయ జన‌తా పార్టీని తొక్కేస్తామంటూ ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.