Janasena ఎంపీ అభ్యర్ధికి దుబాయ్ పోలీసుల లుకౌట్ నోటీసులు
Janasena: ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు దగ్గరపడుతున్న సమయంలో జనసేన పార్టీకి గట్టి షాక్ తగిలింది. కాకినాడ ఎంపీగా టీ టైం సంస్థల అధిపతి తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్‌ను (Tangella Uday Srinivas) ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో అతనిపై దుబాయ్ పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసారు. ఇంటర్ చదివి ఇంజినీరింగ్ చదివానని చెప్పుకుని దుబాయ్ పోలీసులను మోసం చేసాడట.
పోలీసులకు మస్కా కొట్టి ఇండియాకి వచ్చేసి టీ టైం పేరుతో వ్యాపారం ప్రారంభించారు. మొన్న వేసిన నామినేషన్ అఫిడవిట్‌లో ఉదయ్ ఇంటర్ వరకే చదివినట్లు ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. దుబాయ్‌లో ఎన్నో క్రిమినల్ కేసులు ఉన్నాయని.. 2015లోనే ఉదయ్‌పై అరెస్ట్ వారెంట్ జారీ అయ్యిందని.. ఈ నేపథ్యంలో ఉదయ్‌పై లుకవుట్ నోటీసులు కూడా జారీ అయ్యాయని తెలుస్తోంది. అక్కడుంటే పోలీసులు పట్టుకుంటారని అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని ఇండియాకి వచ్చేసినట్లు సమాచారం.
ఈ విషయం జనసేన పెద్దలకు కూడా తెలిసిందని.. కానీ ఇప్పుడు నామినేషన్ గడువు పూర్తయ్యింది కాబట్టి ఇక వేరే అభ్యర్ధిని పెట్టే పరిస్థితి కూడా లేకపోవడంతో మౌనంగా ఉంటున్నారని విశ్వసనీయ వర్గాల సమాచారం.