ప‌రీక్ష‌ల్లో క్రికెట‌ర్ల పేర్లు, జై శ్రీరామ్ నినాదాలు.. పాస్ చేసేసిన టీచ‌ర్

Viral News: విద్యార్ధులు ప‌రీక్ష‌ల్లో సమాధానాలు రాయ‌కుండా క్రికెట‌ర్ల పేర్లు, జై శ్రీరామ్ అంటూ రాసిన‌ప్ప‌టికీ వారు 54 శాతం మార్కుల‌తో పాస్ అయిపోయారు. ఓ మాజీ విద్యార్ధికి అనుమానం వ‌చ్చి స‌మాచార హ‌క్కు చ‌ట్టం (RTI) కింద కేసు వేయ‌డంతో విష‌యం వెలుగులోకి వ‌చ్చింది. ఈ ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఓ యూనివ‌ర్సిటీలో చోటుచేసుకుంది. విద్యార్ధుల‌కు ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌గా అందులో న‌లుగురు విద్యార్ధుల‌కు 56 శాతం మార్కులు వ‌చ్చాయి. అయితే మాజీ విద్యార్ధి వారి పేప‌ర్ల‌ను ప‌రిశీలించ‌గా అందులో ఏమీ రాసి లేదు.

సున్నా మార్కులు రావాల్సింది 56 శాతం మార్కులు రావ‌డంతో స‌మాచార హ‌క్కు చ‌ట్టం కింద పిటిష‌న్ వేసాడు. ఈ నేప‌థ్యంలో విద్యార్ధులు క్రికెట‌ర్లు, జై శ్రీరామ్ పేర్లు రాయ‌డంతో వారి నుంచి డ‌బ్బు తీసుకుని మ‌రీ ఇద్ద‌రు ప్రొఫెసర్లు వారిని పాస్ చేయించిన‌ట్లు విష‌యం బ‌య‌ట‌ప‌డింది. దాంతో పోలీసులు కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌డుతున్నారు.