Amit Shah: అందుకే జగన్‌తో పొత్తు పెట్టుకోలేదు
Amit Shah: ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో (AP Elections) సత్తా చాటుకునేందుకు భారతీయ జనతా పార్టీ (Bharatiya Janata Party) తెలుగు దేశం (Telugu Desam Party), జనసేన పార్టీలతో (Janasena) పొత్తు పెట్టుకున్న సంగతి తెలిసిందే. అయితే మొన్నటి వరకు జగన్ మోహన్ రెడ్డికి (Jagan Mohan Reddy) సపోర్ట్ చేసిన భారతీయ జనతా పార్టీ ఇప్పుడు జగన్‌ను పక్కన పెట్టి ఎందుకు చంద్రబాబు నాయుడుతో (Chandrababu Naidu) పొత్తు పెట్టుకున్నట్లు? ఈ ప్రశ్నకు కేంద్ర మంత్రి అమిత్ షా సమాధానం ఇచ్చారు.
“” మేం చంద్రబాబు నాయుడును NDA కూటమి వదిలి వెళ్లమని ఎప్పుడూ చెప్పలేదు. ఆయనే వదిలి వెళ్లిపోయారు. ఆ తర్వాత నేరుగా ప్రజల్లోకి వెళ్లారు 2019 ఎన్నికల్లో ఓడిపోయారు. ఆ తర్వాత చంద్రబాబుకు తెలిసొచ్చింది. అందుకే మళ్లీ మా కూటమితో చేతులు కలిపారు. ఆయన ఎప్పుడు వస్తానన్నా స్వాగతిస్తాం. ఇక జగన్ మోహన్ రెడ్డితో పొత్తు ఎందుకు పెట్టుకోలేదంటే.. పార్లమెంట్‌లో మేం ప్రవేశపెట్టే బిల్లులకు ఎప్పుడూ కూడా వైసీపీ సపోర్ట్ చేస్తూ వచ్చింది. అలాగని పార్లమెంట్‌లో జరిగే అంశాలను అడ్డం పెట్టుకుని పొత్తులు పెట్టుకోకూడదు. ఒక రాజకీయ పార్టీ మాకు సపోర్ట్ చేస్తోందంటే.. దానర్థం ఆ పార్టీతో పొత్తు పెట్టుకోమని కాదు “” అని తెలిపారు.
2014 ఎన్నికల సమయంలో తెలుగు దేశం పార్టీ NDA కూటమితో ఉన్నారు. అలా ఆయన ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో గెలిచారు. గెలిచిన తర్వాత చంద్రబాబు నాయుడు ఎన్డీయే కూటమి నుంచి బయటికి వచ్చేసారు. ప్రధాని నరేంద్ర మోదీ (Narendra Modi) గురించి తప్పుగా మాట్లాడారు. ఆ తర్వాత 2019 ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఓడిపోయారు. ఆ తర్వాత ఆయన చేసిన తప్పు తెలుసుకుని ఇప్పుడు మళ్లీ భారతీయ జనతా పార్టీతో కలిసేందుకు వెళ్లారు.