Betel Leaf: భోజనం తర్వాత పాన్ ఎందుకు వేసుకోవాలి?
Betel Leaf: భోజనం తర్వాత చాలా మందికి పాన్ వేసుకునే అలవాటు ఉంటుంది. కొందరైతే దీనిని సంప్రదాయంగానూ భావిస్తారు. అసలు భోజనం తర్వాత పాన్ ఎందుకు తినాలి? దాని వల్ల కలిగే లాభాలేంటి?
*పాన్ నములుతున్నప్పుడు నోట్లో నుంచి ఊరే లాలాజలం జీర్ణ ప్రక్రియ సులువుగా అయ్యేలా చేస్తుందట.
*తమలపాకులను ఆయుర్వేద వైద్యంలో వాడతారు. గాయాలను త్వరగా మానేలా చేసే లక్షణం తమలపాకులకు ఉంది.
*నోట్లోని బ్యాక్టీరియాను నిర్మూలిస్తుంది. నోటి దుర్వాసనను అరికడుతుంది.
*తమలపాకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. అనారోగ్య సమస్యలకు దారి తీసే ఫ్రీ రాడికల్స్‌ను అరికడతాయి.
*కీళ్లవాతం, ఆస్తమా వంటి సమస్యలు కూడా తగ్గే అవకాశం ఉందట.