40ల్లో మహిళలు తప్పక చేయించుకోవాల్సిన పరీక్షలు
Health checkup: పురుషులైనా మహిళలైనా ఒక వయసు వచ్చాక చేయించుకోవాల్సిన వైద్య పరీక్షలు కొన్ని ఉన్నాయి. ముఖ్యంగా మహిళలు 40 ఏళ్లు వచ్చాక తప్పక చేయించుకోవాల్సిన పరీక్షలు కొన్ని ఉన్నాయి. అవేంటో తెలుసుకుందాం.
మహిళలకు 40 ఏళ్లు వచ్చాయంటే చాలా మంది దాదాపు పెళ్లిళ్లు అయిపోయి పిల్లలు కనేసి ఉంటారు. అప్పుడు వారికి కుటుంబమే లోకం అయిపోతుంది. తమ ఆరోగ్యాల గురించి పట్టించుకునే తీరక అస్సలు ఉండదు. పిల్లలు పుట్టాక మహిళల శరీరంలోనే అనేక మార్పులు చోటుచేసుకుంటాయి. ఇరవైల్లో ఎలా ఉన్నా 30, 40ల్లో ఫిట్‌గా ఉంటేనే 50, 60 ఏళ్లు వచ్చాక కాస్త ఓపిక ఉంటుంది. ఎవరి పనులు వారు చేసుకోగలుగుతారు.
40ల్లో మహిళలు చేయించుకోవాల్సిన పరీక్షలు
లిపిడ్ ప్రొఫైల్
కొలెస్ట్రాల్ స్క్రీనింగ్
ECG
పాప్ స్మియర్ టెస్ట్
వక్షోజాల స్క్రీనింగ్
థైరాయిడ్
షుగర్ టెస్ట్
మీకు సైట్ ఉంటే ప్రతి ఏడాది కళ్ల చెకప్ చేయించుకోవాలి. సైట్ లేకపోతే ప్రతి రెండేళ్లకోసారి కళ్లు చెకప్ చేయించుకోవాలి.