Exercise: ఖాళీ క‌డుపుతో వ్యాయామం మంచిదేనా?

వ్యాయామం చేయ‌డం ఎంత ముఖ్య‌మో ఏ స‌మ‌యంలో ఎలా చేయాలో తెలుసుకోవ‌డం కూడా అంతే ముఖ్యం (exercise). ఉద‌యాన్నే లేచి నీళ్లు తాగేసి జిమ్‌ల‌కు వెళ్లిపోతుంటారు చాలా మంది. మ‌రికొంద‌రేమో.. బ్రెడ్, అర‌టిపండ్లు లాంటివి తిని జిమ్‌కి వెళ్తారు. అస‌లు ఖాళీ క‌డుపుతో వ్యాయామం చేయ‌వ‌చ్చా? ఈ విష‌యం గురించి తెలుసుకోవ‌డం చాలా ముఖ్యం. ఎందుకంటే.. ఇటీవ‌ల ఓ యువ‌తి ఖాళీ క‌డుపుతో ఉద‌యాన్నే జిమ్‌కి వెళ్లి క‌స‌రత్తులు చేస్తూ కుప్ప‌కూలిపోయింది. ఆమెను హాస్పిట‌ల్‌కు త‌ర‌లించ‌గా అప్ప‌టికే చ‌నిపోయింద‌ని డాక్ట‌ర్లు తెలిపారు. (exercise)

ఫాస్టెడ్ కార్డియో

ఫాస్టెడ్ కార్డియో అంటే.. ఉద‌యాన్నే బ్రేక్‌ఫాస్ట్ చేయ‌కుండా కార్డియో చేయ‌డం. దీని వ‌ల్ల ఆహారం నుంచి ల‌భించే షుగ‌ర్ కాకుండా శ‌రీరంలోని కొవ్వును క‌రిగిస్తుంద‌ట‌. దాని వ‌ల్ల ఫాస్ట్‌గా బ‌రువు త‌గ్గుతారు అని చాలా మంది అభిప్రాయ‌పడుతున్నారు.

సైన్స్ ఏం చెప్తోంది?

రాత్రి భోజనం చేసి నిద్ర‌పోయి ఉద‌యం లేస్తాం కాబట్టి దాదాపు 8 గంట‌ల పాటు ఫాస్టింగ్‌లో ఉంటాం. అంటే.. ఉద‌యం బ్రేక్‌ఫాస్ట్ తినేవ‌ర‌కు క‌డుపు ఖాళీగానే ఉంటుంది. అప్పుడు ఇన్సులిన్ లెవెల్స్ త‌క్కువ‌గా ఉంటాయి. అప్పుడు ఎలాంటి వ్యాయామం చేసినా.. లివ‌ర్ గ్లైకోజెన్ అంటే లివ‌ర్‌లో స్టోర్ అయివున్న కార్బోహైడ్రేట్స్‌ని వాడుకుంటుంది. అప్పుడు మ‌న శ‌రీరం ఒంట్లో ఉన్న కొవ్వును క‌రిగిస్తుంది. ఈ ప్రాసెస్‌ని లిపోలిసిస్ అంటారు. ఈ కొవ్వును కండ‌రాలు ఇత‌ర అవ‌య‌వాలు ఫ్యుయెల్‌గా వాడుకుని మ‌న‌కు ఎన‌ర్జీని ఇస్తాయి. ఈ ప్ర‌క్రియ‌ను ఫ్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ని ఆక్సిడైజ్ చేయ‌డం అని అంటారు. కాబ‌ట్టి.. బ్రేక్‌ఫాస్ట్ చేయ‌కుండా కార్డియో చేస్తే ఎక్కువ ఫ్యాట్‌ని త‌క్కువ కార్బోహైడ్రేట్స్‌ని మ‌న శ‌రీరం వాడుకుంటుంది. అప్పుడు మ‌నం వేగంగా బ‌రువు త‌గ్గుతాం. (exercise)

అయితే ఎన‌ర్జీని బ్యాలెన్స్ చేసే అంశాల‌ను కూడా గుర్తుపెట్టుకోవాలి. మ‌నం తినేదానికంటే ఎక్కువ‌గా వ‌ర్క‌వుట్స్ చేస్తే.. మ‌న‌లోని కొవ్వును మ‌న శ‌రీరం గ్ర‌హించుకుంటుంది. ఒక‌వేళ ఎక్కువ తిని త‌క్కువ వ‌ర్క‌వుట్స్ చేస్తే ఆ కొవ్వు మ‌న‌లో పేరుకుపోతుంది. అందుకే క‌డుపు నిండా తినాలి.. తిన్న‌దానికి త‌గ్గ‌ట్టుగా వ్యాయామం చేయాలి అని హెల్త్ ఎక్స్‌ప‌ర్ట్స్ చెప్తున్నారు. (exercise)