PCOS: ఈ సమస్య ఉన్న ఆడవారిలో ఆత్మహత్య ఆలోచనలు
PCOS .. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్. ఇది మహిళల గర్భాశయానికి సంబంధించిన సమస్య. ఈ సమస్యతో బాధపడే ఆడవారిలో ఆత్మహత్య ఆలోచనలు ఎక్కువగా వస్తుంటాయట. ఈ PCOS అనేది ప్రపంచవ్యాప్తంగా చాలా కామన్ వ్యాధి. ప్రతి ఐదుగురు ఆడవారిలో ఒకరికి వస్తుంది. ఈ సమస్యకు ఎన్నో కారణాలు ఉంటాయి. కుటుంబంలో ఎవరికైనా ఉంటే వస్తుంది. లేదా మన జీవన శైలి బాలేకపోయినా ఊబకాయం వంటి సమస్యలు ఉన్నా PCOS ఎటాక్ చేస్తుంది.
ఈ వ్యాధి వచ్చినప్పుడు హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ అవుతాయి. ఫలితంగా సమాయనికి పీరియడ్స్ రాకపోవడం వంటి సమస్యలు వస్తాయి. సమయానికి నెలసరి వస్తేనే ఆడవారు ఆరోగ్యంగా ఉంటారు. ఎందుకంటే పీరియడ్స్ బాగా అవుతున్నాయి అంటే ఈస్ట్రోజన్ బాగా ప్రొడ్యూస్ అవుతోందని అర్థం. ఈస్ట్రోజన్ బాగుంటే అనారోగ్య సమస్యలు దరిచేరవు. ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వల్ల యాక్నే, పిల్లలు పుట్టకపోవడం వంటి సమస్యలు కూడా ఉంటాయి. పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ తో బాధపడే ఆడవారిలో ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచనలు ఎక్కువగా ఉంటున్నట్లు తైవాన్‌కి చెందిన ఓ యూనివర్సిటీ చేపట్టిన సర్వేలో తేలింది.
1997 నుంచి 2012 వరకు 12 ఏళ్ల నుంచి 64 ఏళ్ల వయసున్న 9000 మంది మహిళలపై ఓ అధ్యయనం చేసారు. వారికి పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వ్యాధి ఉన్నప్పుడు వారి ఆలోచనా విధానాలు ఎలా ఉన్నాయో తెలుసుకున్నారు. ఈ 1997 నుంచి 2012 మధ్య వారికి PCOS రాకముందు వరకు ఎలాంటి ఆత్మహత్య ఆలోచనలు రాలేదు. కానీ ఎప్పుడైతే వారు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ బారిన పడ్డారో చనిపోవాలని చాలా సార్లు అనుకున్నట్లు రీసెర్చ్‌లో తేలింది.
అసలు పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే ఏంటి?
పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ అంటే మహిళల శరీరంలో ఎక్కువగా ఉండాల్సిన ఈస్ట్రోజన్ లెవెల్స్ తగ్గిపోయి యాండ్రోజెన్ లెవెల్స్ పెరిగిపోతే ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ వస్తుంది. దీని వల్ల మానసిక, శారీరక అనారోగ్య సమస్యలు మొదలవుతాయి. అసలు ఏమీ చేయబుద్ధి కాదు. యాక్టివ్‌గా ఉండలేరు. డిప్రెషన్‌లోకి వెళ్లిపోతారు. ఈ పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్‌తో బాధపడే మహిళలను వారే సర్దుకుపోతారు అనే వదిలేయకండి. వారిని ఎల్లవేళలా కనిపెట్టుకుని ఉండాలి. ఒంటరిగా వదిలేయకూడదు. వారు తమ జీవనశైలిలో మార్పులు చేసుకుంటే ఈ సమస్య నుంచి బయటపడచ్చు. అలా వదిలేస్తే ప్రాణాలకే ముప్పు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు.
ఏవి తినాలి? ఏవి తినకూడదు?
కెఫీన్, ఆల్కహాల్ అస్సలు ముట్టకూడదు. కెఫీన్ అలవాటు చేసుకుంటే నెమ్మదిగా మానేసేందుకు యత్నించండి. లేదంటే పరిస్థితి ఇంకా తీవ్రం అయిపోతుంది.
ప్రకృతితో పరిచయం పెంచుకోండి. ఆఫీస్ నుంచి ఇంటికి ఇంటి నుంచి ఆఫీస్‌కి అనే కాకుండా కాస్త అలా బయటికి వెళ్లండి. మీ చుట్టూ పచ్చదనం ఎక్కువగా ఉండేలా చూసుకోండి. దీని వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఒత్తిడి తగ్గుతుంది.
డైట్, వ్యాయామం అనేవి తప్పనిసరిగా పాటించాలి. ఇది కేవలం పాలిసిస్టిక్ ఓవరీ సిండ్రోమ్ ఉన్నవారికే కాదు. అసలు ఎలాంటి అనారోగ్య సమస్యలు లేనివారు కూడా అవి రాకుండా ఉండేందుకు డైట్, వ్యాయామం చేయాల్సిందే. జిమ్‌కి వెళ్లి చేయలేకపోతే రోజూ వాకింగ్ చేయండి. రోజుకు 10వేల అడుగులు వేస్తే ఆయుష్షు పెరుగుతుందని వైద్యులు కూడా చెప్తున్నారు.