Hair Problems: ఏ విట‌మిన్ లోపం వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు వ‌స్తాయి?

Hair Problems: మ‌గ‌వారికైనా ఆడ‌వారికైనా కామ‌న్‌గా ఉండే స‌మ‌స్య జుట్టు రాలిపోవడం, డ్యాండ్ర‌ఫ్‌, జుట్టు ప‌ల్చ‌బ‌డ‌టం. మ‌నం అందంగా కనిపించేలా చేసే శ‌రీర భాగాల్లో కురుల‌ది మొద‌టి స్ధానం. జుట్టు బాగుంటే ఆటోమేటిక్‌గా మ‌నిషికి కాన్ఫిడెన్స్ పెరుగుతుంద‌ని ఓ స‌ర్వేలో కూడా తేలింది. మ‌రి దేని వ‌ల్ల జుట్టు స‌మ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి? ఏ విట‌మిన్ల లోపం వ‌ల్ల ఈ స‌మ‌స్య‌లు వ‌స్తున్నాయో తెలుసుకుందాం.

డ్యాండ్ర‌ఫ్

ఈ డ్యాండ్ర‌ఫ్ అనేది పొడిబారిన చ‌ర్మ‌ క‌ణాలు త‌ల మాడుకు ప‌ట్టి రాలుతుంటే దానిని డ్యాండ్ర‌ఫ్ అంటాం. ఈ స‌మ‌స్య మాలాసెజియా గ్లోబాసా అనే ఫంగ‌స్ వ‌ల్ల ఏర్ప‌డుతుంది. రోగ‌నిరోధ‌క శ‌క్తి లేని వారికి ఈ ఫంగ‌స్ వ్యాపిస్తుంది. హార్మోన‌ల్ ఇంబ్యాలెన్స్ అవుతుంటే కూడా డ్యాండ్ర‌ఫ్ స‌మ‌స్య బాగా ఇబ్బంది పెడుతుంది. (Hair Problems)

ఏ విట‌మిన్ లోపం వ‌ల్ల డ్యాండ్ర‌ఫ్ వ‌స్తుంది?

ఫోలిక్ యాసిడ్ లేదా విట‌మిన్ బి9 లోపిస్తే అది డ్యాండ్ర‌ఫ్‌కు దారి తీస్తుంది. విట‌మిన్ బి9 లోపిస్తే జుట్టు విప‌రీతంగా రాలిపోతుంటుంది. బి9తో పాటు B2, B3, B6, B7, A, D, C విట‌మిన్ల లోపం కూడా కురుల స‌మ‌స్య‌ల‌కు దారి తీస్తాయి.

విట‌మిన్ ఏ కోసం క్యారెట్లు, ఆకుకూర‌లు, గుమ్మ‌డికాయ బాగా తినాలి. విట‌మిన్ బి కోసం చేప‌లు, మాంస‌కృతులు, తృణ‌ధాన్యాల‌ను తీసుకోవాలి. విట‌మిన్ సి కోసం నిమ్మ‌జాతి పండ్ల‌ను ఎక్కువ‌గా తినాలి. నారింజ‌, స్ట్రాబెర్రీ, బొప్పాయిలో ఇది పుష్క‌లంగా ఉంటుంది. పాలు, పెరుగు, గుడ్లు, కాడ్ లివ‌ర్ ఆయిల్, పుట్ట‌గొడుగుల‌తో విట‌మిన్ డి లోపం పోతుంది.

అయితే మీ వ‌య‌సు కూడా జుట్టు స‌మ‌స్య‌ల విష‌యంలో కీలక పాత్ర పోషిస్తుంది. మీరు 30ల్లో ఉన్నారంటే పైన చెప్పిన‌వి పాటించి కురుల‌ను కాపాడుకోవ‌చ్చు. 40, 50, 60ల వ‌య‌సు ఉన్న‌వారు వైద్యుల‌ను సంప్ర‌దించాల్సి ఉంటుంది. ఎందుకంటే వ‌య‌సు పెరిగే కొద్ది జుట్టు రాల‌డం, తెల్ల‌బ‌డ‌టం వంటి స‌మ‌స్య‌లు ఎదుర‌వుతుంటాయి. మ‌నం 20ల నుంచి పైన చెప్పిన విట‌మిన్లు క‌లిగిన ఆహారాలు తింటున్న‌ట్లైతే 50 ఏళ్ల వ‌ర‌కు కురులు దృఢంగా ఉంటాయి.