Vitamin P గురించి తెలుసా?

విట‌మిన్ A, B, C, D ఈ వ‌ర‌కు త‌ర‌చూ వింటూనే ఉంటాం. కానీ విట‌మిన్ పి (vitamin p) అనేది ఒక‌టి ఉందని తెలుసా? అస‌లు ఈ విట‌మిన్ పి సంగ‌తులేంటో తెలుసుకుందాం. ఈ విట‌మిన్ పి అనేది క‌చ్చితంగా విట‌మిన్ అని కాదు. ఫ్లేవనాయిడ్స్‌ని విట‌మిన్ పి అని కూడా పిలుస్తారు. ఫ్లేవ‌నాయిడ్స్ అంటే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్‌ఫ్ల‌మేట‌రీ ప్రాప‌ర్టీలు క‌లిగిన ఒక ఫైటో న్యూట్రియంట్. సింపుల్‌గా చెప్పాలంగే ఈ విట‌మిన్ పి అనేది ఎక్కువ‌గా మొక్క‌ల నుంచి ల‌భించే ఆహార ప‌దార్థాల‌లో ఉంటుంది. ఈ విట‌మిన్ పి అనేది దేని నుంచి ల‌భిస్తోందో.. దీనిని ఆహారంలో భాగంగా చేసుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలేంటో చూద్దాం. (vitamin p)

లాభాలేంటి?

విట‌మిన్ పి తీసుకోవ‌డం వ‌ల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. ర‌క్త‌నాళాల ప‌నితీరు బాగుంటుంది.

విట‌మిన్ పి అనేది యాంటీ ఆక్సిడెంట్‌లా ప‌నిచేస్తుంది కాబ‌ట్టి రోగ‌నిరోధ‌క శ‌క్తి పెరుగుతుంది.

ఆస్తమా, కీళ్ల‌వాతం, అలెర్జీలు రాకుండా ర‌క్షిస్తుంది.

వారికోస్ వీన్స్, చ‌ర్మంపై క‌మిలిన‌ట్లు ఉండ‌టం వంటివి రాకుండా ఆపుతుంది. (vitamin p)

కంటి శుక్లాలు రాకుండా చూపు త‌గ్గ‌కుండా చేస్తుంది.

బ్రెయిన్ ప‌నితీరు బాగుంటుంది.

కొన్ని ర‌కాల క్యాన్స‌ర్లు రాకుండా ఆపుతుంది. అయితే క్యాన్స‌ర్‌పై విట‌మిన్ పి చూపు ప్ర‌యోజ‌నాల‌పై ఇంకా ప‌రిశోధ‌న జ‌రుగుతోంది. (vitamin p)

ఎందులో విట‌మిన్ పి ఉంటుంది?

నిమ్మ‌జాతికి చెందిన పండ్ల‌లో ఈ విట‌మిన్ పి పుష్క‌లంగా ఉంటుంది.

హై క్వాలిటీ డార్క్ చాక్లెట్‌లోనూ ఇది ల‌భిస్తుంది. కాక‌పోతే ఆ చాక్లెట్‌లో కోకో 70% వ‌ర‌కు ఉండాలి.

బ్లూబెర్రీ, స్ట్రాబెర్రీ ఇలా బెర్రీ జాతికి చెందిన అన్ని పండ్ల‌లోనూ ఇది ల‌భిస్తుంది. (vitamin p)

రెడ్ వైన్, ఆకుకూర‌ల్లోనూ పుష్క‌లంగా ఉంటుంది.

ఇలా వివిధ ర‌కాల కూర‌గాయ‌లు, ఆకుకూర‌లు, పండ్లు మీ డైట్‌లో భాగంగా చేసుకుంటే బాడీకి కావాల్సిన విట‌మిన్లు అందుతాయి.