Health: 150 నిమిషాల పాటు వ్యాయామం.. చేయ‌క‌పోతే ఏమ‌వుతుంది?

what happens to your body if you are not doing exercise

 

Health: వారంలో క‌నీసం ఐదు రోజులు వ్యాయామం చేయాలి. లేక‌పోతే శ‌రీరం చ‌తికిల‌ప‌డిపోతుంది. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్ర‌కారం భార‌త‌దేశంలోని 50 శాతం మంది జ‌నాభా అస‌లు వారంలో ఒక్క రోజు కూడా వ్యాయామం చేయ‌డంలేద‌ట‌. ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ ప్ర‌కారం.. ఒక మ‌నిషి వారంలో దాదాపు 150 నిమిషాల పాటు వ్యాయామం చేయాలి. ఒక‌వేళ ఏరోబిక్స్, యోగా వంటివి చేస్తున్న‌ట్లైతే వారంలో 150 నుంచి 300 నిమిషాల పాటు చేయాలి. ఇంకాస్త వేగవంత‌మైన వ్యాయామాలు చేసేవారు వారానికి 70 నుంచి 100 నిమిషాల పాటు చేస్తే చాలు.

శారీర‌క వ్యాయామం లేక‌పోతే గుండెపోటు, క్యాన్స‌ర్, డ‌యాబెటిస్, ఊబ‌కాయం వంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయి. భార‌త‌దేశంలో 101 మిలియ‌న్ మందికి డ‌యాబెటిస్ ఉంది. ఇక నుంచి వ్యాయామాలు మొద‌లుపెట్టాలి అనుకునేవారు రోజూ ఒక 20 నిమిషాల పాటు చిన్న చిన్న బ‌రువులు ఎత్త‌డాలు వంటివి చేస్తూ అరగంట సేపు వాకింగ్ చేస్తే చాలు. ఇలా మెల్లిగా పెంచుకుంటూ వెళ్ల‌చ్చు. ఒకవేళ అనారోగ్య స‌మ‌స్య‌లు ఉంటే మాత్రం వ్యాయామం విష‌యంలో వైద్యుల స‌ల‌హా త‌ప్ప‌కుండా తీసుకోవాలి.

చిన్న చిన్న పనులు స్వ‌త‌హాగా చేసుకున్నా అది కేలొరీల‌ను క‌రిగిస్తుంది. జిమ్‌కి వెళ్లి వేల‌కు వేలు క‌ట్టాల్సిన ప‌ని కూడా లేదు. రోజులో ఏదో ఒక వ్యాయామం చేస్తున్నా చాలు. అలా కాకుండా కేవ‌లం తినేసి ఒకే చోట కూర్చోవ‌డం వంటివి చేస్తుంటే మాత్రం శ‌రీరం షెడ్‌కి వెళ్తుంది అని గుర్తుంచుకోండి.