EXCLUSIVE: గోమూత్రం నిజంగానే మంచిదా? రోగాలు నయమవుతాయా?
EXCLUSIVE: గోమూత్రం సర్వ రోగ నివారిణి అని చెప్తుంటారు. గోషాలల నుంచి మూత్రాన్ని తెప్పించుకుని మరీ తీర్థం తాగినట్లు తాగేవారు చాలా మంది ఉన్నారు. దీని వల్ల రోగాలు నయమవుతాయని.. ఆరోగ్యం బాగుంటుందని అంటుంటారు. అసలు ఈ గోమూత్రానికి నిజంగా అంత పవర్ ఉందా? ఇది తాగితే రోగాలు నిజంగానే నయమవుతాయా? వంటి అంశాలపై క్లియర్‌గా వివరణ ఇచ్చారు ప్రముఖ డైట్ ఎక్స్‌పర్ట్ వీరమాచినేని రామకృష్ణ (vrk)
గోమూత్రం తాగితే నిజంగా రోగాలు నయమవుతాయా?
భక్తి, ఆధ్యాత్మిక భావాలు కలిగినవారు గోమూత్రం పుచ్చుకోవడంలో తప్పు లేదు. కానీ దీనిని దయచేసి సైన్స్‌తో ముడిపెట్టద్దు. గోమూత్రం తాగితే క్యాన్సర్ కూడా నయం అవుతుందని పూర్వీకులు చెప్పారు అంటూ చాలా మంది నా దగ్గరికి ఈ కాన్సెప్ట్‌ను తీసుకొని వస్తున్నారు. దయచేసి ఇలాంటివి నమ్మద్దు.
గోమూత్రం సర్వరోగ నివారిణి అని చాలా మంది అంటున్నారు. దీనిపై మీ అభిప్రాయం?
మనం తిన్నది, తాగినది లోపలికి వెళ్లి దాని పని అది చేసుకుని బయటికి వచ్చేదానినే మలం, మూత్రం అంటాం. అది మనిషికైనా జంతువుకైనా జరిగే ప్రక్రియ ఒక్కటే. మనిషి మూత్రం, మలం తాగుతామా? అలాంటప్పుడు ఆవు మూత్రం ఎలా తాగుతారు? మా కాలంలో ఆవు మూత్రం, పేడ నుంచి వచ్చే వాసన ప్రకృతి అందాలను గుర్తుచేసేలా ఉండేది. కానీ ఇప్పుడ కాలం మారింది. ఆవులు తినే తిండిలో మార్పులు వచ్చాయి. ఒకప్పుడు గోమూత్రం తాగినవారు బాగానే ఉన్నారు. కానీ ఇప్పుడు తాగితే ఇతర రోగాలు వచ్చి పోతారు.
ఆవు, గేదె పాలు కూడా మంచివి కావు అంటారా?
ఒకప్పుడు బోలెడు పోషకాలు ఉండేవి. ఇప్పుడు స్వచ్ఛమైన పాలు అనేది పల్లెటూర్లలో తప్ప ఎక్కడా దొరకడంలేదు. స్టెరాయిడ్లు, యూరియా, కెమికల్స్, మిల్క్ పౌడర్లు కలిపి అమ్మేస్తున్నారు. ఇప్పుడు దొరికే పాలు తాగకపోవడమే మంచిది అని చెప్పాలి.