Vitamin D: 15 రోగాల నివారిణి..!
Vitamin D: ఈరోజుల్లో ప్రపంచంలో అన్ని కుటుంబాలను పట్టి పీడిస్తున్న అతిపెద్ద జబ్బులు మూడు. క్యాన్సర్, షుగర్, పక్షవాతం. ఈ మూడు జబ్బులకు అతి తేలికైన పైసా ఖర్చు లేని ఒకే ఒక వైద్యం ఉందంటే నమ్మగలరా? 24 గంటలు ఉన్న రోజులో కేవలం 20 నిమిషాలను మాత్రమే తీసుకునే ఈ చిన్న వైద్యం ద్వారా ఈ మూడు జబ్బులే కాదు మరో 15 రకాల జబ్బులను కూడా నివారించవచ్చు. అదే విటమిన్ డి. (Vitamin D)
అసలు ఈ విటమిన్ డి అనేది ఏంటి? ఇది ఎక్కడ దొరుకుతుంది? ఈ లోపం ఎవరికి ఉంటుంది? ఏం చేయడం ద్వారా విటమిన్ డి లోపం రాకుండా మనం జగ్రత్త పడచ్చో తెలుసుకుందాం. ఈ విటమిన్ డి అనేది.. ఒక విటమిన్ మాత్రమే కాదు.. ఒక హార్మోన్ కూడా. అంటే.. శరీరంలో ఒక 50 రకాల పనులను విటమిన్ డి చేస్తూ ఉంటుంది. గర్భిణులకు విటమిన్ డి లోపం ఉంటే పుట్టబోయే బిడ్డకు కూడా ఈ లోపం ఉంటుంది. ముఖ్యంగా మన దేశంలో చంటి పిల్లల నుంచి ముసలివాళ్ల దాకా అన్ని వయసుల వారిలోనూ విటమిన్ డి లోపం ఉంటోంది. దీని వల్ల కలిగే పది రకాల జబ్బుల గురించి స్పష్టంగా తెలుసుకోవాలి.
ALSO READ: Vitamin D లెవెల్స్ ఎలా తెలుసుకోవాలి?
కాళ్లు ఒంగిపోతాయి, రికెట్స్ అనే జబ్బు పిల్లల్లో వస్తుంటుంది.. ఇది పెద్దల్లో విటమిన్ డి లోపం వస్తే ఎముకలు మెత్తబడిపోతాయి. ఒక 40, 50 ఏళ్లు వచ్చేసరికి పడితే ఎముకలు పట్టుమని విరిగిపోతుంటాయి. అందులోనూ.. 60 ఏళ్లు దాటిన వారికి ఒకసారి పడ్డారంటే హిప ఫ్రాక్చర్స్ జరుగుతూ ఉంటాయి. ఇవి మళ్లీ అతకవు కూడా. దాంతో జీవితాంతం మంచానికే పరిమితం అవ్వాల్సి వస్తోంది. విటమిన్ డి లోపం వల్ల కండరాలు బలహీనపడిపోతాయి. దాని వల్ల అసమతుల్యత ఏర్పడుతుంది. సరిగ్గా నడవలేరు. తూలుతూ నడిచే ప్రమాదం ఉంటుంది. కండ తగ్గిపోతే 30 ఏళ్లకే తేలికగా చేయగలిగే పనులను చేయలేకపోతుంటారు.
విటమిన్ డి లోపం వల్ల పక్షవాతం వచ్చ ప్రమాదం ఎక్కువ అని ఓ నివేదికలో తేలింది. మతిమరుపు కూడా వస్తుంది. విపరీతమైన అలర్జీలు కూడా వస్తాయి. విటమిన్ డి లోపం వల్ల కూడా అలర్జీలు వస్తాయని చాలా మందికి తెలీదు. కార్డియో వాస్కులర్ డిజార్డర్లు కూడా వస్తాయి. ఇవి గుండెకు సంబంధించిన సమస్యలు. ఆస్తమా సమస్యలు కూడా ఉంటాయి. డయాబెటిస్ కూడా వచ్చే ప్రమాదం ఉంది. వీటన్నింటికీ విటమిన్ డి లోపం అనేది రిస్క్ ఫ్యాక్టర్‌గా నిరూపితమైంది. ఎవరికైతే విటమిన్ డి లెవెల్స్ సరిగ్గా ఉంటాయో వారికి కోవిడ్ వచ్చినా త్వరగా రికవర్ అవుతున్నారని ఆల్రెడీ తెలిసిందే.
తక్కువ లెవెల్స్ ఉంటే వారిలో అత్యధికంగా హాస్పిటల్స్‌లో అడ్మిట్ అవ్వాల్సి రావడం వస్తుంది. మోకాళ్ల చిప్ప అరుగుదల. వంటి ఎన్నో రకాల కీళ్లనొప్పుల వ్యాధులు ఆటో ఇమ్యూన్ సమస్యల వెనుక విటమిన్ డి పాత్ర ఉన్నట్లు తెలుస్తోంది. అనేక రకాల క్యాన్సర్లు కూడా విటమిన్ డి లోపం వల్ల వస్తాయట. కాబట్టి.. ఒకసారి మీరు వైద్యులను సంప్రదించి ముందు విటమిన్ డి లెవెల్స్ చెక్ చేయించుకోండి. 20 కంటే తక్కువగా ఉంటే విటమిన్ డి లోపం ఉన్నట్లు అర్థం ఉండాల్సిన దాని కంటే తక్కువ ఉంటే రోజూ ఉదయాన్నే లేలేత సూర్యకిరణాలు ఒంటికి తగిలేలా 20 నిమిషాల పాటు ఎండలో నిలబడితే సరిపోతుంది. మీరు ఎండలో నిలబడినప్పుడు మీరు భరించగలిగినంత వేడిని తట్టుకోగలిగితే ఆ వేడిలో ఓ 20 నిమిషా పాటు నిలబడితే సరిపోతుంది. కానీ సన్‌స్క్రీన్ రాసేసుకుని ఎండలో నిలబడతానంటే అది పనిచేయదు అని మాత్రం గుర్తుపెట్టుకోండి.