ఈ లక్షణాలున్నాయా? అయితే మీకు ఏ విటమిన్ లోపముందో తెలుసుకోండి
Health: మన శరీరంలో ఏ విటమిన్ లోపించినా కూడా కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. వాటిని లైట్ తీసుకోకుండా సమస్య ఏంటో ఏ విటమిన్ లోపం ఉందో తెలుసుకోగలిగితే ముందు ముందు రాబోయే అనారోగ్య సమస్యలను ఆదిలోనే అరికట్టవచ్చు. ఇప్పుడు మనం విటమిన్ B 12 అనే విటమిన్ గురించి మాట్లాడుకుందాం. ఈ విటమిన్ శరీరానికి చాలా ముఖ్యం. మన మెదడు పనితీరుకు, ఎర్ర రక్త కణాలు పెరగడానికి బి12ది కీలక పాత్ర. ఇది లోపిస్తే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి. ఈ కింది లక్షణాలు మీకూ ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించండి.
*విటమిన్ బి12 లోపిస్తే విపరీతమైన నీరసం ఉంటుంది. ఎందుకంటే ఈ లోపం లోపించడం వల్ల ఎర్ర రక్త కణాలు ఏర్పడవు. శరీరంలోని ఇతర అవయవాలకు రక్త ప్రసరణ చేసేది ఈ ఎర్ర రక్త కణాలే. లేచి రెండు అడుగులు వేసినా అలసిపోతున్నారంటే ఈ బి 12 విటమిన్ లోపించినట్లే.
*విటమిన్ బి 12 లోపిస్తే నరాలు దెబ్బతింటాయి. దీని వల్ల పాదాల్లో పిన్నుతో గుచ్చినట్లుగా అనిపించడం, తిమ్మిర్లు పట్టడం, ఉన్నట్టుండి కాలికి స్పర్శ లేకుండా ఉండటం కూడా లక్షణాలే.
*విటమిన్ బి12 పూర్తిగా లోపించిందంటే కంటి చూపు కోల్పోతారు. మసక మసకగా కనిపిస్తుంటాయి.
*నడుస్తున్నప్పుడు, పరిగెడుతున్నప్పుడు ఆయాసంతో పాటు సరిగ్గా ఊపిరి ఆడకపోతే కూడా ఈ విటమిన్ లోపించినట్లే.
*జ్ఞాపకశక్తి కోల్పోవడం, ఏకాగ్రత కుదరకపోవడం, మూడ్ స్వింగ్స్ అవ్వడం.. అంటే కాసేపు బాగానే మాట్లాడతారు కానీ కొన్ని నిమిషాలకే విపరీతమైన కోపం, చిరాకుతో ఉంటారు. ఇవన్నీ కూడా విటమిన్ బి 12 లోపం వల్ల కలిగే లక్షణాలు.