EXCLUSIVE: లావుగా ఉన్నవారికే డయాబెటిస్ వస్తుందా?
EXCLUSIVE: ఊబకాయం ఉన్నవారికి ఆటోమేటిక్‌గా డయాబెటిస్ వస్తుందని చాలా మంది అనుకుంటారు. ఇది నిజమా? అపోహనా? ఈ విషయంపై మంచి క్లారిటీ ఇచ్చారు ప్రముఖ ఆరోగ్య నిపుణులు వీరమాచినేని రామకృష్ణ.
ఊబకాయం, విపరీతమైన లావు ఉన్నవారికే డయాబెటిస్ వస్తుందని చాలా మంది అపోహ పడుతుంటారని నిజానికి సన్నగా ఉన్నవారికే ఆ ముప్పు ఎక్కువగా ఉంటుందని అంటున్నారు వీరమాచినేని. ఇలా ఉండటానికి దీని వెనుక అర్థంచేసుకోవాల్సిన సైన్స్ ఉందని చెప్తున్నారు. అదేంటంటే.. మనం తినే గ్లూకోజ్‌ను మన ఒంట్లోని కణాలు గ్రహించుకుంటాయి. ఒక్కో కణానికి గ్లూకోజ్‌ను తీసుకునే పరిధి ఉంటుంది.
ఉదాహరణకు ఒక కణం 6 ఇడ్లీలకు సరిపడా గ్లూకోజ్ మాత్రమే తీసుకోగలిగినప్పుడు మనం 10 ఇడ్లీలు తింటే 6 ఇడ్లీల గ్లూకోజ్‌ను గ్రహించుకుని మిగతా 4 ఇడ్లీల గ్లూకోజ్‌ను ఫ్యాట్ రూపంలోకి మార్చేస్తుంది. దీనినే కొవ్వు కణజాలం అంటారు. ఈ కొవ్వు కణజాలానికి కూడా ఓ లెక్క ఉంటుంది. ఈ లెక్క అందరికీ ఒకేలా ఉండదు. కొందరికి పది కిలోలు ఉంటే ఇంకొందరికి 50 కిలోలు ఉంటుంది.
ఎక్కువ మోతాదులోని గ్లూకోజ్‌ను ట్రైగ్లిజరైడ్స్ కింద మార్చినప్పుడు దానిని దాచేందుకు సరిపడా స్టోరేజ్ పాయింట్లో ప్లేస్ ఉంటేనే చేస్తుంది. అలా చేయడానికి సాధ్యం కానప్పుడే రక్తంలోనే గ్లూకోజ్, ఇన్సులిన్ మిగిలిపోయి డయాబెటిస్‌కు దారితీస్తుంది. ఇది సన్నగా ఉన్నవారిలో జరిగే అంశాలు. అదే లావుగా ఉన్నవారిలో ఆల్రెడీ కొవ్వు సంచి పెద్దగా ఉంటుంది కాబట్టి ఎంత తిన్నా అధిక గ్లూకోజ్ కన్వర్ట్ అయిపోతూనే ఉంటుంది కాబట్టి డయాబెటిస్ అంత త్వరగా రాదట. అందుకే సన్నగా ఉన్నవారికి షుగర్ కాదని లావుగా ఉన్నవారికి మాత్రమే వస్తుందన్న అపోహ నుంచి బయటపడాలని అంటున్నారు వీరమాచినేని.