Salt: ఉప్పుకి బ‌దులు ఇవి వాడి చూడండి!

Hyderabad: ఉప్పు (salt) ఎక్కువ తింటే ముప్పే. గుండె స‌మ‌స్య‌లు (heart issues) ఉన్న‌వారికి అస్స‌లు మంచిది కాదు. ఇక ఆ స‌మ‌స్య‌లు లేనివారు తింటే కొని తెచ్చుకున్న‌ట్లే. కానీ ఉప్పు (salt) స‌రిగ్గా నోటికి త‌గ‌ల‌క‌పోతే తిన్న‌ట్టే ఉండ‌దు. అలాంట‌ప్పుడు ఉప్పుకి బ‌దులు ఇవి వాడి చూడండి.

వెల్లుల్లి (garlic)
ర‌క‌ర‌కాల కూర‌ల్లో ఉప్పుకి బ‌దులు తురిమిన వెల్లుల్లి వేసుకుని తిని చూడండి.

నిమ్మ‌ర‌సం (lemon juice)
పుల్ల‌పుల్ల‌గా ఉండే నిమ్మర‌సాన్ని కూడా ఉప్పుకు ప్ర‌త్యామ్నాయంగా వాడుకోవ‌చ్చు. వంట‌కాల‌పై నిమ్మ‌ర‌సాన్ని పిండుకుని తింటే ఉప్పు అవ‌స‌రం ఉండ‌దు.

న‌ల్ల మిరియాలు (black pepper)
కారంగా ఉండే మిరియాల‌తో కూడా ఉప్పు లేకున్నా వంట‌కం రుచికరంగా మార్చుకోవ‌చ్చు.

ఉల్లిపాయ‌లు (onions)
ఉల్లిపాయ‌ల్లో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ‌గా ఉంటాయి. అన్నం తింటున్న‌ప్పుడు లేదా రోటీలు తింటున్న‌ప్పుడు పక్క‌న త‌రిగిపెట్టుకున్న ఉల్లిముక్క‌ల్ని మ‌ధ్య‌లో న‌ములుతుంటే ఉప్పు లేని లోటు తెలీదు.