రోజూ వాడే వస్తువులు.. క్యాన్సర్ కారకాలు
Health: మనం రోజూ వంటింట్లో వాడుకునే వస్తువుల వల్ల క్యాన్సర్ కేసులు పెరుగుతున్నాయన్న సంగతి మీకు తెలుసా? ఆ వస్తువులను వాడటం మానేస్తే ఎలాంటి గొడవ ఉండదు. ఇంతకీ ఏంటా వస్తువులు?
చాలా మంది వంట చేసేటప్పుడు నాన్ స్టిక్ కుక్‌వేర్‌ని వాడేందుకు ఇష్టపడుతుంటారు. దీని వల్ల పెన్నానికి, బాణలికి వంట అతుక్కుపోకుండా నీట్‌గా శుభ్రం చేసుకోవచ్చని అనుకుంటారు. కానీ ఈ నాన్‌స్టిక్ కుక్వేర్ వస్తువుల్లో క్యాన్సర్ కారకాలైన కార్సినోజెన్స్ ఉంటాయి. ఈ నాన్‌స్టిక్ కుక్వేర్‌తో పాటు ప్లాస్టిక్ కంటైనర్లు కూడా రిస్కే. ఎందుకంటే వీటిలో బెంజీన్, ఆస్బెస్టోస్, రేడాన్, ఆర్సెనిక్, ట్రై క్లోరో ఎథిలీన్ వంటి పదార్థాలను ఉపయోగించి తయారుచేస్తారు. ఇవి ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతాయి.
కొన్ని రకాల సెంటెడ్ క్యాండిల్స్ కూడా ఇప్పుడు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. ఇంట్లో వెలిగించి పెట్టుకుంటే మంచి వాసన వస్తాయనుకుంటాం. కానీ ఆ క్యాండిల్స్ నుంచి టోలుయీన్, బెన్జీన్ వంటి విషపూరిత కెమికల్స్ విడుదల అవుతాయి. ఆ విషయం మనకు తెలీక మంచి సువాసన వస్తోందని తెగ వాడేస్తుంటాం. ఇలాంటి సెంటెడ్ క్యాండిల్స్ బదులు సోయ్ క్యాండిల్స్, బీస్ వ్యాక్స్ క్యాండిల్స్ వాడటం ఉత్తమం.
పెయింట్స్
కొన్ని రకాల పెయింట్స్ నుంచి కూడా విషపూరిత కెమికల్స్ విడుదల అవుతూ ఉంటాయి. ఎందుకంటే వీటిలో బెన్జీన్, ఫార్మల్ డీహైడ్ వంటి కెమికల్స్ ఉంటాయి.
ప్లాస్టిక్ కంటైనర్లు
ప్లాస్టిక్ కంటైనర్లలోనూ కార్సినోజెనిక్ కెమికల్స్ ఉంటాయి. అందుకే గ్లాస్ లేదా స్టీల్ కంటైనర్లు వాడుకోవడం ఉత్తమం.
సబ్బులు, డిటర్జెంట్ లిక్విడ్స్
కొన్ని రకాల సబ్బులు, డిటర్జెంట్ లిక్విడ్స్‌లోనూ హానికారక కెమికల్స్ వాడతారు. గిన్నెలను ఎక్కువగా ఇలాంటి సబ్బులు, లిక్విడ్స్‌తోనే కడుతుంటాం. వాటి బదులు ఉప్పు, వెనిగర్ వేసి తోముకోవడం బెటర్.
ALSO READ: