Health: ఈ పది ఆహారాలు సైలెంట్ కిల్లర్స్
Health: అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్.. ఈ పేరు వింటేనే అనారోగ్యం తలుపు తడుతున్నట్లు ఉంటుంది. ఎక్కువ కొవ్వు పదార్థాలు కలిపి, చెక్కర, ప్రిజర్వేటివ్స్, ఫుడ్ కలర్స్, ఉప్పు ఇలా అనారోగ్యానికి కారకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఈ ఫుడ్స్‌లో ఉంటాయి. అందుకే వీటిని సైలెంట్ కిల్లర్స్ అంటారు. ఇవి తింటే గుండె జబ్బులు, ఊబకాయం, క్యాన్సర్ వచ్చే అవకాశాలు ఎక్కువ. మరి ఈ ప్రాసెస్డ్ ఫుడ్స్‌కి బదులు ఎలాంటివి తింటే మంచిదో తెలుసుకుందాం.
కూల్ డ్రింక్స్
సమస్య : ఇందులో చెక్కర మోతాదు మరీ ఎక్కువగా ఉంటుంది. డయాబెటిస్, గుండె జబ్బులు, ఊబకాయ సమస్యలు వస్తాయి
ప్రత్యామ్నాయం: మీకు మీరే హెర్బల్ టీలు తయారుచేసుకోండి. అందులో చెక్కరకు బదులు బెల్లం వాడుకుంటే మరీ మంచిది. కూల్‌గా కావాలంటే డిటాక్స్ డ్రింక్స్ చేసుకుని కూడా తాగచ్చు.
ప్యాకేజ్డ్ స్నాక్స్
సమస్య: అనారోగ్యకరమైన కొవ్వు, ఉప్పు, ఆర్టిఫిషియల్ ఫ్లేవర్లు వాడతారు
ప్రత్యామ్నాయం : నట్స్, విత్తనాలు, డ్రై ఫ్రూట్స్ తినండి. ఇంట్లో ఎయిర్ ఫ్రై చేసిన పాప్‌కార్న్ ఇంకా మంచిది.
ఇన్‌స్టంట్ నూడుల్స్
సమస్య : అధిక మోతాదులో సోడియం. అనారోగ్యకర కొవ్వు పదార్థాలు
ప్రత్యామ్నాయం: గోధుమ పిండితో చేసిన నూడుల్స్ దొరుకుతాయి. రీసెర్చ్ చేసి మంచివి ఎంచుకుని మీరే ఇంట్లో నూడుల్స్ తయారుచేసుకోవచ్చు.
ప్రాసెస్డ్ మాంసం
సమస్య: అధిక మోతాదులో సోడియం, ఆర్టిఫిషియల్ ప్రిజర్వేటివ్స్, హానికారక కొవ్వు పదార్థాలు
ప్రత్యామ్నాయం: గ్రిల్డ్ చికెన్, టర్కీ కోడి
బ్రేక్‌ఫాస్ట్ సిరీల్స్
సమస్య: మార్కెట్‌లో దొరికే కార్న్ ఫ్లేక్స్, కెలాగ్స్, మ్యూస్లీ అస్సలు వద్దు.
ప్రత్యామ్నాయం : మీకు ఓట్స్ తినే అలవాటు ఉంటే అందులో కాసిన్ని పండ్లు, నట్స్, డ్రై ఫ్రూట్స్ వేసుకుని తినేయచ్చు. బ్రేక్‌ఫాస్ట్ చేసే అలవాటు లేకపోతే ఏదన్నా ఒక పండు తినండి