Health: 8 రోజుల్లో బ్లడ్ లెవెల్స్‌ని పెంచే సూపర్ డ్రింక్
Health: మీకు తరచుగా అలసటగా అనిపిస్తోందా? కాస్త అటూ ఇటూ తిరిగినా ఆయాసం వస్తోందా? కాళ్లు చేతులు చల్లబడిపోతున్నాయా? మీ చర్మం పాలిపోతోందా? అయితే మీ శరరీంలో రక్తం తక్కువగా ఉందని అర్థం. ఈ సింపుల్ చిట్కాతో ఎనిమిది రోజుల పాటు క్రమం తప్పకుండా పాటించనట్లైతే మీ శరీరంలో హెమోగ్లోబిన్ లెవెల్స్ పెరుగుతాయి. అలాగే మీ ముఖం నిగనిగలాడుతుంది. ఎనర్జీ కూడా వస్తుంది.
బ్లడ్ లెవెల్స్ తగ్గిపోతున్న కేసులు చాలా సధారణ సమస్యగా మారింది. 60% పిల్లలు, 50% మహిళలు, 25% పురుషులలో బ్లడ్ లెవెల్స్ తక్కువగా ఉంది. దీనిని ఎనీమియా అంటారు. మన బ్లడ్‌లో హెమోగ్లోబిన్ తగ్గితే ఈ సమస్య వస్తుంది. హెమోగ్లోబిన్ పనేంటంటే.. శరీరంలోని ఆక్సిజన్‌కు మూల మూలలకు తీసుకెళ్లడం. ఆక్సిజన్ తక్కువైతే అవయవాలు వీక్ అయిపోతాయి.
అసలు హెమోగ్లోబిన్ ఎంతుండాలి?
మగవారికి 13.5 నుంచి 17 గ్రాముల వరకు ఉండాలి. ఆడవారిలో 12 నుంచి 15.5 గ్రాములు సరిపోతుంది. ఎప్పుడైతే ఈ హెమోగ్లోబిన్ చెప్పిన రేంజ్ కన్నా తగ్గుతుందో అప్పుడు బ్లడ్ లెవెల్ తగ్గి ఎనీమియా వస్తుంది. ఎప్పుడూ అలసగా అనిపించడం, పనిపై శ్రద్ధ లేకపోవడం, కాస్త అటు ఇటు తిరిగినా ఆయాసంగా అనిపించింది. గుండె దడ, కాళ్లు చేతులు చల్లబడటం, కంటలో కింద తెల్లగా మారడం, ముఖం పాలిపోవడం, జుల్లు రాలిపోవడం, గోళ్లు త్వరగా విరిగిపోవడం, మూడ్ స్వింగ్స్, మట్టిని తినాలనిపించడం.. ఇవన్నీ రక్తహీనత లక్షణాలే. (Health)
ALSO READ: Clear Skin: రాత్రికి రాత్రే మెరిసిపోయే చర్మం కోసం..
రక్తం తగ్గితే అసలైన కారణం ఏంటంటే.. ఐరన్ లోపం. ఎందుకంటే.. హెమోగ్లోబిన్‌ని తయారుచేసుకోవడానికి శరీరానికి ఐరన్ అవసరం ఉంది? ఐరన్ తక్కువుంటే హెమోగ్లోబిన్ ఎక్కువగా తయారవ్వదు. ఆకు కూరలు తక్కువగా తింటున్నా.. ఐరన్ కుక్వేర్ని వాడకపోయినా ఐరన్ లెవెల్ తగ్గిపోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. మహిళలకు రుతుక్రమంలో ఓవర్ బ్లీడింగ్ అవ్వడం, అధికంగా టీ, కాఫీ తాగడం కూడా రక్తహీనతకు దారి తీస్తుంది. కానీ చాలా మంది చేసే తప్పు ఏంటంటే.. ఐరన్ సప్లిమెంట్స్ తీసుకుంటూ ఉంటారు. చాలా సార్లు ఈ సప్లిమెంట్స్ సూట్ అవ్వకపోవచ్చు. ఎందుకంటే ఐరన్ బాగా గ్రహించుకోవడానికి శరీరానికి విటమిన్ సి చాలా అవసరం. కేవలం ఐరన్ తీసుకుంటే బాడీకి విటమిన్ సిని ఇవ్వకపోతే ఎలాంటి ఉపయోగం ఉండదు.
ఈ ఒక్క జ్యూస్ చాలు
ఆయుర్వేదం ప్రకారం తయారుచేసుకునే ఈ ఒక్క జ్యూస్‌తో కేవలం ఎనిమిది రోజుల్లోనే ఒంట్లో రక్తం అమాంతం పెరుగుతుంది. ఈ జ్యూస్‌ను ఇంట్లోనే చక్కగా చేసుకోవచ్చు. ఈ జ్యూస్ కోసం మీరు బీట్రూట్ తీసుకోవాల్సి ఉంటుంది. ఇందులో ఐరన్ మాత్రమే కదు ఫోలిక్ యాసిడ్ కూడా ఎక్కువగా ఉంటుంది. దాంతో బ్లడ్ లెవెల్స్ చాలా త్వరగా పెరుగుతుంది. బీట్రూట్ బాడీలో ఆక్సిజన్‌ను పెంచుతుంది. దీని వల్ల అలసట రాదు. ఇన్ఫ్లమేషన్ను కూడా సరిచేస్తుంది. బీట్రూట్తో పాటు క్యారెట్ కూడా తీసుకోవాలి. ఇందులో విటమిన్ ఏ ఉంటుంది కాబట్టి హెమోగ్లోబిన్ను పెంచడంలో చాలా ఉపయోగపడుతుంది.
ఇక మూడో పదార్థం ఏంటంటే.. ఉసిరి. ఉసిరి రక్తాన్ని పెంచడమే కాదు.. ప్యూరిఫై చేస్తుంది. విటమిన్ సి ఎంత అవసరమో అంత ఉసిరిలోనే ఉంటుంది. అంతేకాదు.. ఉసిరిలో ఐరన్ కూడా ఉంటుంది. దీనిని జ్యూస్‌లో కలుపుకోవడం వల్ల మంచి రుచి కూడా వస్తుంది. ఈ మూడు పదార్థాలను జ్యూస్ చేసుకోండి. అన్నీ కలిపి ఒక గ్లాస్ జ్యూస్ రావాలి. ఈ ఒక్క జ్యూస్‌ని క్రమం తప్పకుండా 8 రోజులు తాగండి. ఆ తర్వాత మీ బ్లడ్ రిపోర్ట్ చెక్ చేసుకోండి. ఫలితం మీకే తెలిసిపోతుంది.