Heart Health: శీతాకాలం.. గుండె జర భద్రం..!
Heart Health: అసలే చలికాలం.. గుండె సంబంధిత సమస్యలు ఈ కాలంలోనే ఎక్కువ అవుతాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలి. చలికాలంలో అసలు ఏ పనీ చేయబుద్ధి కాదు. పైగా వేడి వేడిగా ఏదో ఒకటి తినాలనో తాగాలతో అనిపిస్తుంటుంది. ఇందుకోసం బయటి ఫుడ్‌నే ఎక్కువగా తినేస్తుంటారు. శీతాకాలంలో ఎక్కువగా ఎఫెక్ట్ అయ్యే అవయవం మన గుండే. శీతాకాలంలో ఎక్కువగా హార్ట్ ఎటాక్స్ వస్తుంటాయి.
ఆల్రెడీ గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారు ఈ కాలంలో ఇంకా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేసుకుంటూ ఉండాలి. వెచ్చని దుస్తులు ధరించాలి. వీలైనంత వరకు ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నించండి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకారం.. చలికాలంలో చలి కారణంగా రక్తనాళాలు మూసుకుపోయే ప్రమాదం ఉంటుందట. దీని వల్ల బీపీ ఎక్కువై గుండె పోటుకు దారితీస్తుంది.
చలికాలంలో గుండెదడ ఎక్కువగా ఉంటుంది. అదీకాకుండా చలికాలంలో బయటికి వెళ్లి వాకింగ్, వ్యాయామాలు చేసేవారికి కూడా కాస్త రిస్క్ అనే చెప్పాలి. ఈ చలికాలం కాస్త తగ్గుముఖం పట్టే వరకు ఇంటి పట్టునే వ్యాయామాలు చేసుకోవడం ఉత్తమం. చలి తీవ్రత ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో అరిథ్మియా, ఆంగినా వంటి గుండె సమస్యలు వస్తాయి. (heart health)