Milk: రాత్రి పాలు తాగుతున్నారా.. ఇవి తెలుసుకోండి

రాత్రి ప‌డుకోబోయే ముందు గ్లాస్ పాలు (milk) తాగి ప‌డుకుంటే మంచి నిద్ర‌ప‌డుతుంద‌ని అంటారు. మంచి నిద్ర సంగ‌తి ప‌క్క‌న‌పెడితే రాత్రి పాలు తాగితే కొన్ని స‌మ‌స్య‌లు త‌ప్ప‌వ‌ని కూడా తెలుసుకోవాలి.

పాల‌ల్లో కాల్షియం, విట‌మిన్ D లాంటి ఎన్నో పోష‌కాలు ఉంటాయి అన‌డంలో ఏ సందేహం లేదు. కాక‌పోతే ఇందులో ఉండే ప్రొటీన్, లాక్టోస్ రాత్రిళ్లు స‌రిగ్గా నిద్ర ప‌ట్ట‌నివ్వ‌కుండా డిస్ట‌ర్బ్ చేస్తాయ‌ట‌. రాత్రి వేళ‌ల్లో మ‌న శ‌రీరం డీటాక్సిఫికేష‌న్ ప్రాసెస్‌లో ఉంటుంది. కానీ పాలు తాగి ప‌డుకుంటే ఆ ప్రాసెస్‌కి ఇబ్బంది అవుతుంద‌ట‌. అప్పుడు లివ‌ర్ ప‌నితీరు నెమ్మ‌దిస్తుంది. ఇక రాత్రిళ్లు చ‌ల్ల‌ని పాలు తాగ‌డం అస్స‌లు మంచిది కాదు. ఒక‌వేళ ఆల్రెడీ క‌డుపు నొప్పి, మోష‌న్స్ అవ్వ‌డం లాంటి స‌మ‌స్య‌లు ఉన్న‌వారు రాత్రి పాలు తాగకూడ‌దు. మ‌రో విష‌యం ఏంటంటే.. రాత్రి పాలు తాగి ప‌డుకుంటే బ‌రువు కూడా పెరిగే అవ‌కాశాలు ఉంటాయ‌ట‌. ఎందుకంటే ఒక గ్లాసు పాల‌ల్లో 120 కేలొరీలు ఉంటాయి. పాలు తాగి నిద్ర‌పోతాం కాబ‌ట్టి ఈ కేలొరీలు క‌రిగే ఛాన్స్ లేదు. కాబ‌ట్టి అది కొవ్వుగా మారిపోతుంది. (milk)

అయితే పాలు అస్స‌లు మంచివి కాదు అని అన‌డంలేదు. అంద‌రికీ ఇలాగే అవుతుంద‌ని కూడా లేదు. ఇలా అయిన‌వారి నుంచి సేక‌రించిన డేటా ఆధారంగా ఈ విష‌యాలు బ‌య‌టికి వచ్చాయి. ఒక‌వేళ మీరు రాత్రి పాలు తాగాక పైన చెప్పిన అంశాల్లో ఏ ఒక్క‌టీ అవ్వ‌లేదు అంటే మీరు నిశ్చితంగా కంటిన్యూ చేయొచ్చు. కానీ పైన చెప్పిన‌వాటిలో ఏ ఒక్క ల‌క్ష‌ణం మీలో క‌నిపించినా రాత్రి పాలు తాగ‌డం మానేసి చూడండి. (milk)