Health: బొడ్డుకు నూనె రాసుకుంటే స‌మ‌స్య‌లు త‌ప్ప‌వా?

Health: తల్లి గ‌ర్భం నుంచి బిడ్డ బ‌య‌టికి వ‌చ్చాక బొడ్డును (Navel) కోసేస్తారు. ఆ భాగ‌మే క‌డుపు మ‌ధ్య‌లో చిన్న రంధ్రంలా మారుతుంది. చాలా మంది క‌డుపు మ‌ధ్య‌లో ఉండే బొడ్డును ఓ దెబ్బ‌లాగా భావిస్తుంటారు. సినిమాల్లో దీనిని ఓ రొమాంటిక్ పార్ట్‌గా వాడుకుంటారు కానీ బొడ్డు గురించి మ‌నం తెలుసుకోవాల్సిన చాలా అంశాలు ఉన్నాయి. వాటి గురించి తెలిస్తే ఇక నుంచి బొడ్డును ఎంతో జాగ్ర‌త్త‌గా చూసుకోవ‌డం మొద‌లుపెడ‌తారు.

మ‌నం కురుల‌కు నూనె రాసుకుని మ‌ర్ద‌న చేసుకుంటాం. ఇంకొంద‌రైతే ముఖానికి, శ‌రీరానికి ఆయిల్ మ‌సాజ్ చేయించుకుంటూ ఉంటారు. ఇలా మ‌సాజ్ చేయించుకోవ‌డం వ‌ల్ల క‌లిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. కానీ కేవ‌లం బొడ్డుకు నూనె రాయడం వ‌ల్ల క‌లిగే లాభాలేంటో తెలుసా? కేవ‌లం బొడ్డుకు నూనె రాయ‌డం వ‌ల్ల శ‌రీరంలోని ఇత‌ర అవ‌య‌వాల ప‌నితీరు మెరుగుప‌డుతుంది. ఒక్క బొడ్డుకు నూనె రాస్తే శరీరంలోని 72000 న‌రాలు ఉత్తేజితం అవుతాయి. అంటే.. శ‌రీరం అంతా నూనె రాసుకునే బ‌దులు కేవ‌లం బొడ్డుకు నూనె రాసుకుంటే త‌ల నుంచి పాదం వ‌ర‌కు ఎన్నో లాభాలు ఉన్నాయి. ఓ మొక్క‌కు కేవ‌లం వేర్ల ద‌గ్గ‌ర నీళ్ల‌తో త‌డిపితే ఆ మొక్క ఎంత ఆరోగ్యంగా ఎదుగుతుందో.. బొడ్డు ద‌గ్గ‌ర నూనె రాసి కాసేపు మ‌ర్ద‌న చేస్తే కూడా శ‌రీరం అంత ఆరోగ్యంగా త‌యార‌వుతుంది.

ఆయుర్వేద భాష‌లో బొడ్డును స‌ద్యోప్ర‌ణ్హార్ మ‌ర్మ అంటారు. మొత్తం శ‌రీరంలో బొడ్డు భాగం చాలా సున్నితంగా ఉంటుంది. అందుకే బొడ్డు ద‌గ్గ‌ర గ‌ట్టిగా గుద్దినా.. లేదా ప్ర‌మాద‌వ‌శాత్తు ఏద‌న్నా తగిలినా ప్రాణాల‌కే ముప్పు అని వైద్యులు చెప్తుంటారు. శరీరంలోని అన్ని ర‌హ‌స్యాల‌కు బొడ్డు ప్ర‌ధాన ద్వారం అని ప‌తంజ‌లి మ‌హ‌ర్షి చెప్పేవారు.

బొడ్డుకు నూనె రాయ‌డం వ‌ల్ల ఏమ‌వుతుంది?

బొడ్డుకు నూనె రాస్తే ముందు ఆరోగ్యంగా మారేది ముఖం, పెదాలు. పురాత‌న కాలంలో ఇప్పుడున్న క్రీంలు లేవు కాబ‌ట్టి ఆడ‌వారు బొడ్డుకు ఆవ నూనె రాసుకుని మ‌ర్ద‌న చేసుకునేవార‌ట‌. అందుకే వారి ముఖ వ‌ర్చ‌స్సు కాంతిమంతంగా ఎంతో చ‌క్క‌గా ఉండేద‌ట‌. పెదాలు కూడా గులాబీ పువ్వు రేకుల్లా మెరిసిపోయేవి. ఇలా బొడ్డుకు నూనె రాసి మ‌ర్ద‌న చేయ‌డం వ‌ల్ల చ‌ర్మం లోలోతుల్లో రిపేర్ అవుతుంది. మీరు కూడా బొడ్డుకు నూనె రాసుకోవాల‌నుకుంటే బాదం నూనె కానీ విట‌మిన్ ఈ ఉన్న కోల్డ్ ప్రెస్డ్ (గానుగ నుంచి తీసింది) నూనెను కానీ వాడ‌చ్చు. ఆయుర్వేదం ప్ర‌కారం రెండు చుక్క‌ల వేప నూనెను బొడ్డుకు రాసుకుంటే మొటిమ‌లు, ర్యాషెస్, దుర‌ద ఉండ‌వ‌ట‌.

మ‌నం తినే తిండిని అరిగించ‌డంలో 40 శాతం పాత్ర క‌డుపులోనే ఉంటుంది. మీకు ఒక‌వేళ క‌డుపు ఉబ్బ‌రంగా ఉన్న‌ట్లు అనిపించినా, గ్యాస్ స‌మ‌స్య‌లు ఉన్నా బొడ్డుకు నూనె రాసి కాసేపు మ‌ర్ద‌న చేయండి చాలు. ఎంత రిలీఫ్ ఉంటుందో మీకే తెలిసిపోతుంది. అసిడిటీ, జీర్ణ స‌మ‌స్య‌లు ఉంటే కొబ్బ‌రి నూనెను బొడ్డుకు రాసుకోవ‌డం మేలు.

మ‌నం బ్రెయిన్ యాక్టివ్‌గా ఆనందంగా ఉండేందుకు తోడ్ప‌డే హార్మోన్ సెరోటొనిన్‌. ఈ సెరోటొనిన్ హార్మోన్ 90 శాతం బొడ్డు నుంచే త‌యార‌వుతుంది. మీరు ఎప్పుడైనా బ్యాడ్ న్యూస్ విన్న‌ప్పుడు ఆటోమేటిక్‌గా క‌డుపులో ఏదో తిప్పుతున్న‌ట్లు అనిపిస్తుంది. ఎప్పుడైనా గ‌మ‌నించారా? దానికి కార‌ణం మ‌న క‌డుపు మ‌న‌కు రెండో బ్రెయిన్‌తో స‌మానం కాబ‌ట్టి. కాబ‌ట్టి.. బొడ్డుకు ఆవు నెయ్యి రాసుకుంటే ఆ సెరోటొనిన్ హార్మోన్ ఎక్కువ‌గా ఉత్ప‌త్తి అవుతుంది. అప్పుడు మీ మూడ్ ఎంత సంతోషంగా హాయిగా ఉంటుందో మీకే తెలుస్తుంది.