Beetroot వయాగ్రాలా పని చేస్తుందా?
Beetroot: బీట్రూట్ వల్ల ఎన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో తెలిసిందే. రక్తం పెరిగేలా చేస్తుంది. ఎనీమియా నుంచి రక్షిస్తుంది. చర్మం మెరిసేలా చేస్తుంది. అయితే ఈ బీట్‌రూట్ కేవలం ఒక కూరగాయ మాత్రమే కాదు.. ఇది వయాగ్రాలా కూడా పని చేస్తుందని షాకింగ్ విషయాన్ని వెల్లడించారు యూకే చెందిన ఓ వైద్యుడు.
ఒకప్పుడు రోమన్లు ఈ బీట్‌రూట్‌ను వయాగ్రాకు ప్రత్యామ్నాయంగా వాడేవారట. దీని వల్ల వారి శృంగార జీవితం ఎంతో బాగుండేది. అయితే బీట్‌రూట్ సెక్స్ లైఫ్‌ను మెరుగుపరుస్తుంది అని చెప్పడానికి తక్కువ సైంటిఫిక్ ఆధారాలు ఉన్నాయి.
ఇది వయాగ్రాలా ఎలా పనిచేస్తుంది?
బీట్‌రూట్ తిన్నప్పుడు అది బ్యాక్టీరియా ఎన్‌జైమ్‌లు కలిసి దానిలో ఉన్న నైట్రేట్‌ని నైట్రిక్ ఆక్సైడ్‌గా మారుస్తాయి. ఈ నైట్రిక్ ఆక్సైడ్ వల్ల రక్త నాళాలు తెరుచుకుని రక్త ప్రసరణ సులువుగా అయ్యేలా చేస్తుంది. ఈ నైట్రిక్ ఆక్సైడ్ పురుషుల్లో టెస్టోస్టిరోన్‌ను బాగా పెంపొందిస్తుందట. శృంగారానికి ముందు శృంగార ప్రక్రియ సమయంలో రక్త ప్రసరణను కంట్రోల్ చేస్తుందని తేలింది. దీని వల్ల పురుషులు, మహిళల్లోనూ శృంగార విషయంలో మార్పులు చోటుచేసుకుంటాయి. అయితే శృంగార జీవితం మెరుగుపడేందుకు పూర్తిగా బీట్రూట్ పైనే ఆధారపడితే సరిపోదని కూడా నిపుణులు చెప్తున్నారు.