Intermittent Fasting: ప్రాణానికే ప్రమాదమా?
Intermittent Fasting: ఈ మధ్యకాలంలో చాలా మంది ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ అనే దానిపై ఎక్కువ ఫోకస్ చేస్తున్నారు. అంటే.. ఉదయం పూట ఎక్కువగా తినేసి మళ్లీ 12 గంటలు లేదా 18 గంటల పాటు ఏమీ తినకపోవడం.. లేదా ప్రతి 8 గంటలకు ఒకసారి తింటుండడం వంటివి చేస్తుంటారు. ఇప్పుడు ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగే ప్రాణాంతకంగా మారింది. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేసేవారిలో గుండెపోటు మరణాల శాతం ఎక్కువ అని ఓ అధ్యయనంలో తేలింది. దాంతో చాలా మంది షాక్‌కు గురయ్యారు.
అయితే ఇక్కడ మనం గుర్తుంచుకోవాల్సిందేంటే.. వారానికి ఒకసారి కానీ 15 రోజులకు ఒకసారి కానీ ఉపవాసం ఉంటే మంచిది అని చాలా రీసెర్చ్‌లు ప్రూవ్ చేసాయి. ఇలా చేసేవారిలో క్యాన్సర్లు కూడా తక్కువగా వస్తున్నాయని చెప్పారు. అయితే ఈ ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ విషయంలో మాత్రం షాకింగ్ ఫలితాలు వచ్చాయనే చెప్పాలి. కొన్ని రోజుల ముందే అమెరికాలో ఒక్క సైంటిఫిక్ ప్రెజెంటేషన్ జరిగింది. దానిలో రీసెర్చర్లు అమెరికాకు చెందిన 4000 మంది జనాభాపై స్టడీ చేసారు. వారిలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ ఫాలో చేసేవారిలో కార్డియాక్ మోర్టాలిటీ (గుండె సంబంధిత) కేసులు 90శాతం ఎక్కువగా ఉన్నట్లు తేలింది. ఇది పూర్తిగా ఇంకా పబ్లిష్ కాలేదు. ఇది కేవలం ప్రిలిమినరీ ఫైండింగ్ మాత్రమే. దీని గురించి సైంటిఫిక్‌గా చెప్పాలంటే సిస్టమ్యాటిక్‌గా స్టడీ చేయలేదు. దీనికి ఇంకా చాలా స్టడీ చేయాల్సి ఉంటుందని మన భారతీయ వైద్యులు చెప్తున్నారు. ఒక చిన్న రీసెర్చ్‌ని పట్టుకుని ఇది అందరికీ వర్తిస్తుంది అనడానికి లేదని వైద్యులు అంటున్నారు.