Heart Attack In Winter: ఎలా కాపాడుకోవాలి?

Heart Attack In Winter: గుండెపోటు ఫ‌లానా స‌మ‌యంలోనే వ‌స్తుంద‌ని ఎవ్వ‌రూ చెప్ప‌లేరు. ఏ వ‌య‌సు వారికైనా ఎప్పుడైనా వ‌చ్చే ప్ర‌మాదం ఉంటుంది. అయితే గుండెపోటులు ఎక్కువ‌గా వ‌చ్చేది ఈ చ‌లికాలంలోనే. చ‌లికాలంలో గుండె కండ‌రాలు ముడుచుకునిపోతుంటాయి. దీని వ‌ల్ల ర‌క్త ప్ర‌స‌ర‌ణ స‌రిగ్గా జ‌ర‌గ‌క‌ శ్వాస తీసుకోవ‌డం ఇబ్బందిగా మారి గుండెపోటుకు దారి తీస్తుంది. (heart attack in winter) మ‌రి మ‌న గుండెని ఈ చ‌లికాలంలో ఎలా ప‌దిలంగా ఉంచుకోవాలి? ఎలాంటి జాగ్ర‌త్త‌లు తీసుకోవాలి? వంటి అంశాల‌ను ప‌రిశీలిద్దాం.

చికిత్స కంటే నివార‌ణ బెట‌ర్

ఈ ప్ర‌పంచంలో అత్య‌ధిక మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నది గుండెపోటు వ‌ల్లే. ఒక్క‌సారి గుండెపోటు వ‌స్తే గుండెను పూర్తిగా నయం చేయ‌డం, ఒక‌వేళ బ‌తికి బ‌య‌ట‌ప‌డినా మ‌ళ్లీ రాదు అని గ్యారెంటీ ఇవ్వ‌లేం. గుండెపోటును నివారించుకోవ‌డ‌మే మ‌న‌కు ఉన్న ఏకైక మార్గం. కొన్ని లైఫ్‌స్టైల్ మార్పులు చేసుకుంటే గుండెను ప‌దిలంగా ఉంచుకోవ‌చ్చు.

చ‌లికాలంలోనే ఎందుకు ఎక్కువ గుండెపోటులు వ‌స్తాయి?

ఎందుకంటే చ‌లికాలంలో ర‌క్త‌పోటు అధికంగా ఉంటుంది. అదీకాకుండా చ‌లి వేస్తున్న‌ప్పుడు మ‌నిషి వ‌ణుకుతున్న‌ప్పుడు ఒంట్లోని కండ‌రాలు కూడా నొప్పి పెడుతుంటాయి. ఇలా అధిక ర‌క్త‌పోటు కార‌ణంగా గుండెపోటు వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి.