Belly Fat: వేలాడే పొట్ట.. తగ్గేది ఎట్టా?
Belly Fat: చాలా మంది పొట్ట దగ్గర ఉండే కొవ్వు ఒక్కసారి పెరిగితే మళ్లీ తగ్గదు అంటుంటారు. అందులో నిజం లేదు. వేలాడే పొట్టను కరిగించడం కాస్త కష్టమైన పనే. కానీ అసాధ్యం మాత్రం కాదు. వేలాడే పొట్టను ఆరు టిప్స్ ద్వారా సులువుగా సహజంగా తగ్గించుకోవచ్చు. మీరు వీటిని సరిగ్గా ఫాలో అయితే ఎలాంటి సందేహం లేకుండా బెల్లీ ఫ్యాట్ తగ్గడం మొదలవుతుంది.
మన శరీరంలోని ఉదర భాగాల్లో కొవ్వు పేరుకుపోవడం మొదలైతే దానర్ధం విజరల్ ఫ్యాట్ పెరుగుతోందని. ఈ ఫ్యాట్ వల్ల ఇతర అవయవాల్లోనూ కొవ్వు పేరుకుపోతోంది. ఈ కొవ్వు చూడటానికి అసహ్యంగా ఉండటమే కాదు సైన్స్ ప్రకారం ఇది చాలా ప్రమాదకరం. లోపల తయారైన ఈ కొవ్వు అవయవాల పనితీరుని ఆపేయడం వల్ల గుండెపోటు, బీపీ, లివర్ సమస్యలు వచ్చే అవకాశాలు చాలా రెట్లు పెరిగిపోతాయి. అందుకే ఈ వేలాడే పొట్టను చికిత్సలు, మందుల ద్వారా కాకుండా సహజంగా తగ్గించుకోవడం ఎంతో ముఖ్యం. (Belly Fat)
నీళ్లు తాగుతూ ఉండాలి
సైన్స్ ప్రూవ్ చేసిన అంశం ఏంటంటే.. శరీరంలోని కొవ్వు కరగాలంటే లిక్విడ్ కంటెంట్ ఎక్కువగా ఉండాలి. అంటే నీళ్లు, నీటి ఆధారిత ఆహార పదార్థాలు ఎక్కువ తీసుకోవాల్సి ఉంటుంది. ప్రతి రోజూ ఉదయం లేస్తూనే బ్రష్ చేయకముందే గోరు వెచ్చని నీటిని తాగాలి. దీనిలో ఏమీ కలపకండి. వేడి నీళ్లు తాగడం వల్ల బాడీ మెటబాలిజం పెరుగుతుంది.
ఇది పెరగడం వల్ల బాడీలో పేరుకుపోయిన ఫ్యాట్‌ని బ్రేక్ చేయడం మొదలుపెడుతుంది. వేడి నీళ్లు తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ ఫాస్ట్‌గా ఉంటుంది. దీని వల్ల ఉదయాన్నే మల విసర్జన సులువుగా అయిపోతుంది. మల విసర్జన సులువుగా అయితే పొట్టలోని మలినాలు బయటికి పోతాయి.. పొట్ట కూడా తగ్గిపోతుంది. బ్రేక్‌ఫాస్ట్ లంచ్‌కి మధ్యలో లేదా లంచ్ డిన్నర్‌కి మధ్యలో ఎప్పుడైనా ఆకలి వేస్తోంది అనిపిస్తే అప్పుడు అన్నింటికన్నా ముందుగా నీళ్లు తాగండి. చాలా సార్లు మనకి నిజంగా ఆకలి వేయకపోవచ్చు. కానీ శరీరం డీహైడ్రేట్ అవ్వడం వల్ల కూడా ఆకలి వేస్తుంది.
చెక్కర వద్దు
రిఫైన్డ్ చెక్కరకు గుడ్‌బై చెప్పేయండి. ఉదాహరణకు గులాబ్ జామున్ అద్భుతంగా ఉంటుంది. చూడగానే నోట్లో నీళ్లూరుతాయి. కానీ ఇందులో ఒక్కటి కూడా మంచి పదార్థం ఉండదు. ఈ గులాబ్ జామున్ తినడం వల్ల ఎన్నో రెట్ల షుగర్, ఆయిల్, కేలొరీలు తప్ప ఏమీ ఉండవు. ఈరోజు పొట్టలో కొవ్వు పేరుకుపోతోందంటే.. అందుకే చెక్కరే ప్రధాన కారణంగా సైన్స్ కూడా చెప్తోంది. చెక్కర కూడా కెమికల్ ప్రాసెసింగ్ ద్వారా విపరీతంగా రిఫైన్ చేసేస్తున్నారు. ఇది శరీరం గ్రహించుకోలేదు. కేవలం ఇన్సులిన్‌నే పెంచేస్తుంది. ఫలితంగా షుగర్ వస్తుంది. అందుకే రిఫైన్డ్ షుగర్‌తో తయారు చేయబడిన స్వీట్స్‌కి దూరంగా ఉండండి. మీరు పది రోజులు చెక్కరను ఆపేసి చూడండి.. మీకే తెలిసిపోతుంది మీ పొట్ట తగ్గుతోందని.
ప్రొటీన్‌ని పెంచుకోండి
బెల్లీ ఫ్యాట్‌ను తగ్గించుకోవడానికి ఆహారంలో ప్రొటీన్ ఎక్కువగా ఉండేలా చూసుకోండి. ప్రొటీన్ ఫ్యాట్ లాస్‌కి చాలా ఉపయోగపడుతుంది. ప్రొటీన్ మెల్లిగా జీర్ణం అవుతుంది. దీని వల్ల పొట్ట ఫుల్‌గా ఉన్నట్లు అనిపిస్తుంది. ప్రొటీన్ వల్ల మెటబాలిజం పెరుగుతుంది. దాంతో శరీరం స్వయంగా ఎక్కువ కేలొరీలను బర్న్ చేస్తుంది. ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సిన అంశం ఏంటంటే.. ప్రొటీన్ అంటే సప్లిమెంట్లు, ప్రొటీన్ పౌడర్లు కాదు. సహజంగా ఆకుకూరలు, పప్పులు, పాలు, పెరుగు, పన్నీర్, ఓట్స్, శెనగల నుంచి లభించేవి ఎంచుకోవాలి.
దీని వల్ల జంక్ ఫుడ్ తినాలన్న క్రేవింగ్స్ కూడా రావు. అదనంగా కేలొరీలు వెళ్లడంలేదు కాబట్టి తిన్నంత వరకు కేలొరీలనే కరిగించేస్తుంది. వీటితో పాటు వేయించిన ఆహార పదార్థాలకు దూరంగా ఉండాలి. జస్ట్ ఇవి పాటించి చూడండి.. మీ వేలాడే పొట్టను ఓ పట్టు పట్టండి.