Health: మధ్యాహ్న నిద్ర.. ఆపుకోవడం ఎలా?
Health: రాత్రిళ్లు హాయిగా నిద్రపడితే అంతకంటే ఇంకేం కావాలి? కానీ మధ్యాహ్న వేళల్లో వచ్చినంత నిద్ర రాత్రిళ్లు రాదు. మధ్యాహ్న వేళల్లో నిద్ర వస్తున్నప్పుడు పడుకుంటే వచ్చే సంతృప్తి ఉదయం లేవగానే కాదు. కానీ మనకున్న పనులు పక్కన పెట్టి మధ్యాహ్న వేళల్లో నిద్రపోలేం కదా..! మరి అలా నిద్రరాకుండా ఉండాలంటే ఏం చేయాలి?
కారణాలేంటి?
రోజూ నిద్రపోయే సమయాన్ని నిర్ధారించుకోండి. మీకు రాత్రిళ్లు 9 గంటలకు పడుకునే అలవాటు ఉంటే అదే ఫాలో అవ్వండి. అంతేకానీ ఒకరోజు 9 గంటలకు మరో రోజు 12 గంటలకు అలా నిద్రపోతే మధ్యాహ్నం విపరీతంగా నిద్రవస్తుంది.
ఎక్కువగా ఫ్రైడ్ ఆహారం తినడం.. మద్యం సేవించడం వంటివి చేసినా విపరీతంగా నిద్రపోతూ ఉంటారు.
ఎక్కువగా ఒత్తిడికి గురైనా కూడా మధ్యాహ్న వేళల్లో నిద్ర వస్తూ ఉంటుంది.
నీళ్లు సరిగ్గా తాగకపోయినా నీరసంతో నిద్ర వస్తుంది
ఇక మందులు వేసుకునే అలవాటు ఉన్నా నిద్ర పట్టేస్తుంది.
ఎలా నియత్రించుకోవాలి?
ఇందాక చెప్పినట్లు ఒకే సమయం పెట్టుకుని అదే సమయానికి నిద్రపోవడం లేవడం అని పెట్టుకోండి
తేలికపాటి ఆహారం తీసుకుంటూ ఉండండి. వాటిలో ప్రొటీన్, పీచు ఎక్కువగా ఉంటే చాలు
మధ్యాహ్నం కెఫీన్, మద్యానికి దూరంగా ఉండండి. కొందరికి కెఫీన్ వల్ల కూడా నిద్రొస్తుంటుంది.
ఎప్పటికప్పుడు తగినన్ని నీళ్లు తాగుతూ ఉండండి
రోజూ శరీరానికి విటమిన్ డి అందాలి. ఉదయం సూర్యుడు ఉదయిస్తున్న సమయంలో ఒక పది నిమిషాలు కూర్చున్నా చాలు
మరీ ఎక్కువగా నిద్రొస్తుంటే అల్లారం పెట్టుకుని అరగంట పాటు నిద్రపోతే బెటర్.
రోజూ వ్యాయామం చేస్తూ ఉండండి