Sleep: క్షణాల్లో నిద్రలోకి జారుకోవాలంటే..!
Sleep: జీవితంలో ఏది ఉన్నా లేకపోయినా నిద్ర లేకపోతే బ్రతకడం కష్టం. రాత్రి సమయంలో మంచి నిద్ర ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు ఎంతో ముఖ్యం. మీరు ఎంత హాయిగా నిద్రపోతున్నారు అనేదానిపైనే మీ ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కానీ ఈ రోజుల్లో లైఫ్‌స్టైల్ ప్రకారం మంచి నిద్రపట్టదు. ఇలాగే కొనసాగితే దీర్ఘకాలిక అనారోగ్య సమస్యలు వస్తాయి. ఒకవేళ మీరు ఎనిమిది గంటలు నిద్రపోతున్నా కూడా అలసిపోయినట్లు అనిపిస్తోందా? అయితే నిద్ర విషయంలో మీరు తెలిసో తెలీకో ఏదో తప్పు చేస్తున్నారని అర్థం. (Sleep)
నిద్రను పాడుచేసే 5 వరస్ట్ అలవాట్లు
క్రమం తప్పకుండా నిద్రపోకపోతే మన బాడీలోని అంతర్గత గడియారం డిస్టర్బ్ అవుతుంది. దీని వల్ల గాఢంగా నిద్రపట్టక మన మూడ్, మానసిక ఆరోగ్యం, ఆకలి, గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. అందుకే ప్రతి రోజూ ఇంచు మించు ఒకే సమయంలో నిద్రపోవడానికి ప్రయత్నించండి. ఎవరైతే గంటల కొద్ది మధ్యాహ్నం పడుకునే ఉంటారు వారికి రాత్రిళ్లు పడుకోవడంలో సమస్యలు వస్తాయి. ఒకవేళ మధ్యాహ్నం పడుకోవాలంటే అరగంట సేపు చాలు.
ఇక నిద్రపోయే సమయంలో మీరు సరైన రీతిలో పడుకోకపోయినా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. ఆరు నుంచి 8 గంటలు పడుకున్నప్పటికీ అలసటగా ఉంటే తప్పుడు క్రమంలో పడుకుంటున్నట్లు అర్థం. చాలా మంది కాళ్లు ముడుచుకుని పడుకోవడం వల్ల వీపు, నడుపు నొప్పి వస్తుంది. ముఖాన్ని కిందకు దించి పడుకోవడం వల్ల పొట్ట పెద్దగా రౌండ్‌గా తయారైపోతుంది.
ALSO READ: Bedroom Plants: వీటితో మంచి నిద్రపడుతుందట..!
చేతిపై తలపెట్టుకుని పడుకుంటే కణజాలాలపై ప్రభావం చూపచ్చు. ఇవన్నీ మీ నిద్రకు భగ్నం కలిగించే బ్యాడ్ పొజిషన్స్. ఎడమ వైపున తిరిగి పడుకోవడం ఎంతో మంచిదని వైద్యులు కూడా సూచిస్తున్నారు. దీని వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి. ఇది రక్తప్రసరణను పెంచి లివర్‌ను ఓవర్ లోడ్ అవ్వనిద్దు. గుండెలో మంట తగ్గుతుంది. పేగులు క్లీన్ అవ్వడానికి తోడ్పతుంది. దీని వెనుక సైంటిఫిక్ కారణం కూడా ఉంది. ఎప్పుడైతే మనం ఎడమ వైపున నిద్రపోతామే కడుపులోని యాసిడ్‌ను పైకి ఎగబాకనివ్వదు. (Sleep)
అల్లారం మోగినప్పుడు వెంటనే నిద్రలేవండి. అంతేకానీ స్నూజ్ చేసి నిద్రపోవడానికి ప్రయత్నించకండి. దీని వల్ల సరిగ్గా నిద్రపోయినట్లు అనిపించదు. ప్రతిరోజూ ఇలా చేయడం వల్ల మైండ్ డిస్టర్బ్ అయిపోతుంది. మన శరీరం ఒక టైంని ఫిక్స్ అవుతుంది. కాబట్టి మొదటిసారి అలారం మోగగానే లేవండి. రోజులో మూడు నుంచి నాలుగు కప్పుల చాయ్, కాఫీ తాగేవారికి నిద్రలేమి సమస్యలు వస్తాయి. వీటిని తాగే అలవాటు మీకుంటే వెంటనే మానేయండి. ఒకవేళ వెంటనే మానేయలేకపోతే తాగడం తగ్గించండి.
రాత్రి వేళల్లో డిన్నర్ తినకపోయినా, కడుపు నిండా తినేసినా నిద్ర పట్టదు. పడుకునేటప్పుడు ఎక్కువగా నీళ్లు తాగడం వల్ల కూడా నిద్ర డిస్టర్బ్ అవుతుంది. రాత్రి పడుకునే ముందు వ్యాయామం చేసినా కూడా నిద్ర పట్టదు. ఎందుకంటే వ్యాయామం చేసాక మైండ్, బాడీ ఎగ్జైట్ అవుతాయి. దాంతో నిద్రపట్టదు. వ్యాయామం వల్ల మీకు మంచి నిద్ర పడుతుంది. ఇందులో ఎలాంటి డౌట్ లేదు.. కానీ పడుకోవడానికి నాలుగు, ఐదు గంటల ముందే చేయండి.