Meal: భోజనం ఇలా చేస్తే మంచిదట..!
ఇప్పుడున్న ఉరుకులు పరుగుల జీవితంలో ఏం తింటున్నామో ఎంత తింటున్నామో చూసుకునే టైం కూడా ఉండటం లేదు. తిన్నామా కడుపు నిండిందా అన్నదే చూసుకుంటున్నాం. కానీ అసలు భోజనం ఎలా తినాలో ఎలా తింటే మన శరీరానికి కావాల్సిన పోషకాలు అందుతాయో తెలుసా? (meal)
ఏదో తినాలి కాబట్టి నోట్లో ముద్దలు పెట్టేసుకోకండి. ప్రతి ముద్దను ఆస్వాదిస్తూ తిని చూడండి. ఏం తింటున్నారో ఎప్పుడు తింటున్నారో చూసుకోవడం కూడా చాలా ముఖ్యం. మీకు ఆకలి వేసినప్పుడే తినండి. అంతేకానీ ఎవరో బలవంతం చేస్తేనో తినకపోతే ఏమైనా అనుకుంటారనో తినేయకండి. తర్వాత కడుపులో తిప్పితే మనమే బాధపడాలి.
ఇప్పుడు ప్రతి ఇంట్లో డైనింగ్ టేబుల్స్ వచ్చేసాయి. అందరూ వాటిపైనే కూర్చుని తింటున్నారు. కానీ అది సరైన పద్ధతి కాదు. కింద కూర్చుని తినడం ఉత్తమం. అలా తిన్నప్పుడు ప్రతి ముద్దకు కాస్త ముందుకు వంగి తింటాం కాబట్టి మన కడుపు నిండిందో లేదో మనకే తెలిసిపోతుంది. కింద కూర్చుని వంగి తినడం వల్ల జీర్ణక్రియ కూడా బాగా అవుతుంది. (meal)
ఇక స్పూన్లు, ఫోర్క్‌లతో అస్సలు తినకండి. మొత్తం ఐదు వేళ్లతో భోజనాన్ని కలుపుకుని తినండి. మీ చేతి వేళ్లలో ఎంత ఆహారం పడుతుందో ఎంత తినగలుగుతామో తెలుస్తుంది. అదే స్పూన్‌తో తింటే అసలు తిన్నట్లు అనిపించదు.. పైగా ఎంత తిన్నా తక్కువే తిన్నట్లు ఉంటుంది. ఇక నోట్లో ముద్ద పెట్టుకోగానే ఫాస్ట్‌గా నిమిలి మింగేస్తుంటారు. మనకు తెలీకుండానే జరిగే ప్రక్రియ కాబట్టి మనం కూడా దాని గురించి అంతగా పట్టించుకోం. ప్రతి ముద్దని 24 సార్లు నమిలి మింగాలట. అప్పుడే మనం తిన్నది ఒంటికి బాగా పడుతుంది.
తింటున్నప్పుడు మాట్లాడకండి. మీ దృష్టి అంతా మీరు తింటున్న ఒక్కో ముద్దు పైనే ఉండాలి. కొందరు పక్కన కూర్చుని తినేటప్పుడు తెగ వాగుతుంటారు. కొన్ని సందర్భాల్లో ఏమీ చేయలేం. కనీసం మీ ఇంట్లో ఉన్నప్పుడైనా ప్రశాంతంగా తినడానికి ప్రయత్నించండి. (meal)