Rice: బ‌రువు పెర‌గ‌కుండా అన్నం ఎలా తినాలి?

అన్నం (rice) తింటే బ‌రువు పెరిగిపోతామ‌ని (weight gain) లావైపోతామ‌ని చాలా మంది నోరు క‌ట్టేసుకుని కూర్చుంటారు. అన్నం తిన‌కుండా రోటీలు ఎక్కువ‌గా తినాల‌నుకుంటారు. కానీ మ‌రీ అన్నం తిన‌కుండా ఉన్నా కూడా మంచిది కాదు. అందుకే అన్నం తిన్నా బ‌రువు పెర‌గ‌కుండా ఉండాలంటే ఈ టిప్స్ పాటించండి.

*అన్నం తినేట‌ప్పుడు మ‌న‌కు తెలీకుండానే ఎక్కువ‌గా పెట్టేసుకుని తింటుంటాం. మ‌నం చేసే మొద‌టి త‌ప్పు ఇదేన‌ని అంటున్నారు ప్ర‌ముఖ పోష‌కాహార నిపుణురాలు న‌మామి అగ‌ర్వాల్ (nmami agarwal).

*అన్నం ఒక క‌ప్పు మాత్ర‌మే పెట్టుకుని ఎక్కువ శాతం కూర లేదా ప‌ప్పు వేసుకుని తినాలి. మీరు తినే అన్నంలో ఎక్కువ శాతం కూర‌లు, ప‌ప్పు వంటివి ఉంటే బ‌రువు పెరుగుతార‌న్న భ‌యం అక్కర్లేదు. ఎందుకంటే కూర‌గాయ‌లు, ప‌ప్పు వంటి వాటి వ‌ల్ల బరువు పెర‌గ‌రు.

*ప్లేట్‌లో అన్నం పెట్టుకోవ‌డానికి మందు కూర‌, ప‌ప్పు, స‌లాడ్ మీరు ఏది వండుకుంటే అది వేసుకోండి. ఆ త‌ర్వాత అన్నం పెట్టుకోండి. అప్పుడే ఎంత అన్నం పెట్టుకోవాలో క్వాంటిటీ తెలుస్తుంది. (rice)

*చివ‌ర్లో కాస్త పెరుగ‌న్నం తినడం మ‌ర్చిపోకండి. పెరుగులో ప్రోబ‌యోటిక్స్ ఉంటాయి. చివ‌ర్లో పెరుగున్నం తిన‌డం వ‌ల్ల జీర్ణ ప్ర‌క్రియ బాగుంటుంది.