ఇవి స్వ‌చ్ఛ‌మా కాదా అని తెలుసుకోవ‌డం ఎలా?

Health: మార్కెట్ నుంచి నేరుగా కొనుక్కుని తెచ్చిన కొన్ని ఆహార ప‌దార్థాలు చూడ‌గానే ఫ్రెష్‌గా ఉన్న‌ట్లు అనిపిస్తాయి కానీ అవి స్వ‌చ్ఛ‌మైన‌వా కావా అని చెప్ప‌డం చాలా క‌ష్టం.

తేనె (honey)

తేనెలో ఎక్కువ‌గా చెక్క‌ర‌, షుగ‌ర్ సిర‌ప్, గ్లూకోజ్ క‌లుపుతుంటారు. తేనె స్వ‌చ్ఛ‌మైన‌దా కాదా అని తెలుసుకోవ‌డానికి ఒక చిన్న దూది ఉండ‌ను తేనెలో ముంచి కాల్చి చూడండి. వెంట‌నే కాలిపోతే ఆ తేనె స్వ‌చ్ఛ‌మైన‌ద‌ని అర్థం. కాదంటే అందులో చెక్క‌ర‌, షుగ‌ర్ సిర‌ప్ వంటివి క‌లిపార‌ని అర్థం.

ప‌సుపు (turmeric)

ప‌సుపులో చాక్ పౌడ‌ర్, క్రోమేట్, మెటానిల్ ఎల్లో రంగు క‌లుపుతుంటారు. మ‌నం వాడే ప‌సుపు స్వ‌చ్ఛ‌మైన‌దో కాదో తెలుసుకోవాలంటే.. ఒక గ్లాసులో గోరువెచ్చ‌ని నీళ్లు తీసుకుని అందులో ఒక స్పూన్ ప‌సుపు వేయండి. దాన్ని క‌దిలించ‌కుండా ఒక అర‌గంట పాటు ప‌క్క‌న పెట్టండి. అర‌గంట త‌ర్వాత వేసిన పసుపు అడుగు భాగంలో ఉంటే అది స్వ‌చ్ఛ‌మైన‌ద‌ని అర్థం.

నెయ్యి (ghee)

నెయ్యి ప్యాకెట్ల‌లో వెజిట‌బుల్ నూనె, గంజి, వ‌న‌స్ప‌తి క‌లుపుతుంటారు. మ‌న నెయ్యి స్వ‌చ్ఛ‌మా కాదా అని తెలుసుకోవ‌డానికి క‌రిగించిన ఒక స్పూన్ నెయ్యిలో కాస్త చెక్క‌ర వేయండి. ఈ మిశ్ర‌మాన్ని బాగా క‌ల‌పండి. ఐదు నిమిషాల త‌ర్వాత ఆ మిశ్ర‌మం రంగు ఎర్ర‌గా మారితే అందులో వెజిట‌బుల్ నూనె, వ‌న‌స్ప‌తి వంటివి క‌లిపిన‌ట్లు అర్థం.

కారం పొడి (red chilli powder)

సాధార‌ణంగా క‌ల్తీ కారం పొడుల్లో ఇటుక‌ల పౌడ‌రు, ఆర్టిఫిషియ‌ల్ రంగులు క‌లిపేస్తుంటారు. కారం పొడి స్వ‌చ్ఛ‌త తెలుసుకోవాలంటే ఒక గ్లాసు నీళ్లల్లో కారం పొడి వేసి బాగా క‌ల‌పండి. ఒక‌వేళ కారం పొడి అడుగున కూర్చుంటే అందులో ఇటుక‌ల పొడి క‌లిపారని అర్థం. అదే నీళ్లు ఎర్ర రంగులోకి మారిపోతే ఆర్టిఫిషియ‌ల్ రంగులు క‌లిపార‌ని అర్థం.

యాపిల్ (apple)

నిగ‌నిగ‌లాడేలా క‌నిపించేందుకు కొవ్వొత్తుల వ్యాక్స్ కోటింగ్‌గా వేస్తారు. యాపిల్ పండుపై గీకితే తెల్ల‌టి పొడి వ‌స్తోందంటే అది క‌చ్చితంగా వ్యాక్సే.

ఉప్పు (salt)

ఉప్పులో ఎక్కువ‌గా చాక్‌పీసుల పొడి వేసి అమ్మేస్తుంటారు. స్వ‌చ్ఛ‌త గురించి తెలుసుకోవాలంటే ఒక గ్లాసు నీటిలో కాస్త ఉప్పు వేసి చూడండి. తెల్ల‌టి పొడి అడుగు భాగంలో ఉంటే అది చాక్ పీస్ పొడి.

పాలు (milk)

నీరు, యూరియా, గంజి డిట‌ర్జెంట్, సింథ‌టిక్ పాల పొడి క‌లిపి అమ్మేస్తుంటారు. పాల మ‌ర‌క‌లు క‌నిపిస్తే అవి స్వ‌చ్ఛ‌మైన‌వి అని అర్థం. ఎలాంటి మ‌ర‌క‌లు క‌నిపించ‌కుండా ఉంటే అందులో క‌చ్చితంగా ఏవో క‌లుపుతున్నార‌ని తెలుసుకోవాలి.