Diabetes: ఎర్ర లైటుతో షుగర్ మాయమైపోతుందా? ఇదేం మ్యాజిక్?
Diabetes: డయాబెటిస్ అనేది ఒక మాయరోగం. ఇది ఒక్కసారి వచ్చిందంటే మనిషిని పీక్కు తిని పీల్చి పిప్పి చేసేస్తుంది. జీవితాంతం మందులపై ఆధారపడాల్సి ఉంటుంది. నచ్చినవి తినలేని పరిస్థితి. ఇలాంటి రాకాసి వ్యాధిని పెద్ద పెద్ద మందులే ఎదుర్కోలేకపోతున్నాయి. అలాంటిది ఒక ఎర్ర లైటే ఎదుర్కోగలదు అంటే నమ్ముతారా? అసలేంటీ ఎర్ర లైటు మ్యాజిక్? తెలుసుకుందాం.
యూనివర్సిటీ ఆఫ్ లండన్‌లోని శాస్త్రవేత్తలు ఓ విషయాన్ని కనుగొన్నారు. ఎర్రటి లైటుని మనిషి వీపుపైన 15 నిమిషాల పాటు ఆన్ చేసి ఉంచితే.. బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయట. అసలు లైట్‌కి బ్లడ్ షుగర్‌కి సంబంధం ఏంటి అనుకుంటున్నారా? ఒక వ్యక్తి వీపు పైన ఎర్రటి లైటుని వేసి 15 నిమిషాల పాటు ఉంచితే.. శరీరంలోని మైటోకాండ్రియా (కణాల్లోని పవర్ హౌజ్) ఎక్కువ శక్తిని పెంపొందిస్తుంది. ఫలితంగా బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయట. తిన్న తర్వాత ఈ లైట్ థెరపీని వాడటం వల్ల బ్లడ్ షుగర్ లెవెల్స్ 28% తగ్గించినట్లు పరిశోధనలో తేలింది.
ALSO READ: Health: పోర్న్ చూడటం ఎలా మానుకోవాలి?
తిన్న తర్వాత బ్లడ్ షుగర్ ఇమ్‌బ్యాలెన్స్ అయినప్పుడు కూడా ఈ లైట్ థెరపీ ఉపయోగపడుతుందట. ఫలితంగా డయాబెటిస్ కంట్రోల్‌లోకి వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఈ రీసెర్చ్‌లో భాగంగా సంపూర్ణ ఆరోగ్యంతో ఉన్నవారిపైనే పరిశోధనలు జరిపారు. LED లైట్ల నుంచి కామన్‌గా వెలువడే బ్లూ లైట్ల వల్ల ప్రమాదం పొంచి ఉందని ఎందుకంటే బ్యాలెన్స్ చేయడానికి LEDలో రెడ్ లైట్ ఉండదని అంటున్నారు. ఈ ఇమ్‌బ్యాలెన్స్ వల్ల మన శరీరంలోని బ్లడ్ షుగర్ లెవెల్స్ కూడా కంట్రోల్‌లో ఉండవు. అందుకే ఈ రెడ్ లైట్ థెరపీపై మరిన్ని పరిశోధనలు చేసి మందులు లేకుండా కేవలం లైట్ థెరపీతోనే డయాబెటిస్‌ను తగ్గించే మార్గాన్ని కనుగొననున్నారు. (Diabetes)
ALSO READ:
Vitamin D: 15 రోగాల నివారిణి..!