Fasting ఆరోగ్యానికి మంచిదా కాదా?
ఈ మధ్యకాలంలో ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ (fasting) అనేది తరచూ వింటున్నాం. బరువు తగ్గాలనుకునేవారు ఒకేసారి కావాల్సినంత ఆహారం తినేసి మళ్లీ 12, 15 గంటల పాటు ఏమీ తినకుండా ఉంటారు. ఈ ట్రెండ్ ఇప్పుడు చాలా మంది ఫాలో అవుతున్నారు. ఇది ఒక రకమైన ఫాస్టింగ్ అయితే.. మరొకటి దేవుడి కోసం చేసేది. అదే ఉపవాసం. పేరు ఏదైనా అది మన ఆరోగ్యంపైనే ప్రభావం చూపుతుంది. అయితే ఈ ఫాస్టింగ్ చేసేవారి ఆరోగ్యంతో పోలిస్తే.. అసలు ఎలాంటి నియమం లేకుండా సాధారణంగా భోజనం చేసే వారి ఆరోగ్యానికి ఎంతో తేడా ఉంటుంది. (fasting)
ఎందుకంటే ఒకేసారి ఆహారం ఎక్కువగా తినడం కంటే కొద్ది కొద్దిగా రోజులో ఆరు సార్లు తీసుకోవడం ఉత్తమం అని ఇప్పటికే ఎందరో వైద్యులు కూడా చెప్పారు. మనం ఫాస్టింగ్ చేస్తున్నాం అంటే దాని అర్థం పూర్తిగా తినకుండా కూర్చోవడం కాదు. తక్కువ కేలొరీలు ఉన్న ఆహారం తీసుకుంటున్నామని. ఇది దేవుడికి చేసే ఉపవాస అంశం కాదు. సాధారణంగా బరువు తగ్గాలనుకునేవారు చేసే ఫాస్టింగ్ గురించి చర్చించుకుంటున్నాం. 2018లో చేసిన రీసెర్చ్ ప్రకారం తక్కువ కేలొరీలు, తక్కువ ప్రొటీన్ డైట్ తీసుకోవడం, ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ చేయడం వల్ల వయసు కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు రావని ఎలకలపై చేసిన ప్రయోగంలో తేలిందట.
ఎలకలకు ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్లో భాగంగా తక్కువ మొత్తంలో ఆహారం ఇవ్వడం వల్ల వాటికి హార్ట్ రేట్, బ్లడ్ ప్రెషర్, ఇన్సులిన్ లెవెల్స్ కాస్త తగ్గాయట. ఈ మార్పులు గుండె పనితీరు మెరుగ్గా ఉందని చెప్పడానికి నిదర్శనం. మనం రోజూ చేసే వ్యాయామాలు.. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్తో బాడీలో వచ్చే మార్పులు ఒకేలా ఉన్నట్లు తేలిందని శాస్త్రవేత్తలు తెలిపారు. ఇంటర్మిటెంట్ ఫాస్టింగ్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది. ఫలితంగా ఒత్తిడి కారణంగా వచ్చే అనారోగ్య సమస్యలు కూడా తగ్గిపోతాయి. (fasting)
గమనిక: ఇది కేవలం అవగాహన కోసం అందించిన సమాచారం మాత్రమే. ఆరోగ్యం, ఆహారానికి సంబంధించిన నిర్ణయాలు తీసుకునే ముందు వైద్యులను సంప్రదించడం ఉత్తమం.