Blackheads పోవాలంటే ఇలా చేసి చూడండి

ముక్కుపై వ‌చ్చే బ్ల్యాక్ హెడ్స్ (blackheads) ఇబ్బందిపెడుతున్నాయా? దీనిని నివారించుకునేందుకు పార్ల‌ర్‌కు వెళ్లి వేల‌కు వేలు ఖ‌ర్చు చేయాల్సి అవ‌స‌రం లేదు. ఈ సింపుల్ చిట్కాల‌తో ఇంట్లోనే బ్ల్యాక్ హెడ్స్ బాధ‌ను వ‌దిలించుకోండి. బ్ల్యాక్ హెడ్స్ అనేది కూడా యాక్నే కిందికే వ‌స్తుంది. న‌ల్ల పింపుల్స్‌లా క‌నిపిస్తాయి. బ్యాక్టీరియా వ‌ల్ల ఈ బ్ల్యాక్ హెడ్స్ ఏర్ప‌డ‌తాయి. వీటిని నివారించుకోవాలంటే ఈ కింద చెప్పిన ఫేస్ ప్యాక్స్ ట్రై చేసి చూడండి. అమ్మాయిలే కాదు అబ్బాయిలు కూడా ఈ టిప్స్‌ని పాలించ‌వ‌చ్చు. (blackheads)

హ‌నీ, రోజ్ ఆయిల్ ఫేస్ మాస్క్

తేనె, అలోవెరా జెల్, నాలుగు చుక్క‌ల రోజ్ ఆయిల్ తీసుకుని పేస్ట్‌లా చేసుకోండి. దానిని బ్ల్యాక్ హెడ్స్ ఉన్న చోటే కాకుండా మొత్తం ముఖం, మెడ‌పై పూయండి. 20 నిమిషాలు ఆగి కాస్త గోరువెచ్చ‌ని నీళ్ల‌తో చేతులు త‌డుపుతూ మ‌ర్ద‌న చేసుకోండి. వారంలో రెండు మూడు సార్లు చేస్తుంటే మార్పు మీకే క‌నిపిస్తుంది.

గ్రీన్ టీ

గ్రీన్ టీని తాగ‌డానికే కాకుండా టోన‌ర్‌గా కూడా వాడుకోవ‌చ్చు. కొన్ని నీళ్ల‌లో టీ ట్రీ ఆయిల్ వేసుకుని ఒక గ్రీన్ టీ బ్యాగు కానీ గ్రీన్ టీ ఆకుల‌ను కానీ వేయండి. కాస్త మ‌రిగించాక వ‌డ‌గ‌ట్టండి. ఆ నీళ్లు కాస్త చ‌ల్లారాక ఫ్రిజ్‌లో పెట్టండి. దానిని ఒక స్ప్రే బాటిల్‌లో పోసుకుని ఫేస్‌పై టోన‌ర్‌లాగా స్ప్రే చేసుకుంటే రిజ‌ల్ట్ మీకే తెలుస్తుంది. (blackheads)

టీ ట్రీ ఆయిల్ అండ్ అలోవెరా జెల్

అలోవెరా జెల్‌లో కాస్త టీ ట్రీ ఆయిల్ వేసి ముఖం అంతా మ‌ర్ద‌న చేసినా మంచి ఫ‌లితం ఉంటుంది. అలోవెరా కాడ‌ల‌ను తీసుకున్న‌ప్పుడు ప‌సుపు రంగులో క‌నిపించే భాగాన్ని తీసేయండి. దాని వ‌ల్ల ముఖంపై అలెర్జీలు వ‌స్తాయి.