Heart Attack: ట్రాఫిక్ శబ్దాలతో గుండెపోటు..!
Heart Attack: ట్రాఫిక్ శబ్దాలతో గుండె పోటు, గుండె సంబంధిత వ్యాధులు ఎక్కువ అవుతున్నాయని పరిశోధకులు కొత్తగా చేపట్టిన రీసెర్చ్ ద్వారా కనుగొన్నారు. ఎపిడెమియలాజికల్ డేటా ద్వారా పరిశోధకులు రీసెర్చ్ నిర్వహించారు. ట్రాఫిక్ శబ్దాలు 10 డిసెబెల్స్ దాటితే గుండెకు ముప్పే అని తేల్చారు. ట్రాఫిక్ శబ్దాల కారణంగా గుండెపోటు, గుండె సంబంధిత వ్యాధులు, డయాబెటిస్ వచ్చే అవకాశం 3.2 శాతంగా ఉందని వెల్లడించారు.
ఈ ట్రాఫిక్ శబ్దాల వల్ల నిద్రపోయే సమయం తగ్గిపోయి.. ఫలితండా ఒత్తిడికి గురిచేసే హార్మోన్లు ఎక్కువై రక్తనాళాలపై ప్రభావం చూపుతున్నాయట. ఈ నేపథ్యంలో ఆయా శాఖల రవాణా అధికారులు శబ్దాల విషయంలో చర్యలు తీసుకుంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో శబ్దాన్ని కంట్రోల్ చేసే నాయిస్ బ్యారియర్లు ఏర్పాటు చేయాలని సూచించారు.