Belly Fat: ఇది చాలా డేంజరస్
Hyderabad: కొందరు చూడటానికి సన్నగా ఉన్నా కూడా బెల్లీ ఫ్యాట్ (belly fat) మాత్రం క్లియర్‌గా కనిపిస్తుంటుంది. ఈ బెల్లీ ఫ్యాట్ అంటే పొట్ట కింది భాగంలో కొవ్వు పేరుకుపోవడం అనేది చాలా డేంజరస్. కొవ్వు పేరుకుపోయే కొద్ది పై ఫొటోలో కనిపిస్తున్నట్లు ఆర్గన్స్ కూడా అలా కొవ్వు పట్టుకుపోయినట్లు ఉంటాయట. మరి ఈ బెల్లీ ఫ్యాట్ (belly fat) అని తగ్గించుకోవడం ఎలా?
కుదిరితే వారంలో నాలుగు సార్లు కార్డియో (cardio) చేయండి. మీరు తినే మొదటి మీల్‌లో 50% ప్రొటీన్ ఉండేలా చూసుకోండి. దీని వల్ల ఫుడ్ క్రేవింగ్స్ అనేవి ఉండవు. బెల్లీ ఫ్యాట్ (belly fat) పేరుకుపోవడానికి ఈ ఫుడ్ క్రేవింగ్సే ప్రధాన కారణం. ఆల్కహాల్ మాత్రం అస్సలు వద్దు. మీరు ఎంత కార్డియో చేసినా ఎంత మంచి ఫుడ్ తిన్నా.. ఆల్కహాల్ మానుకోలేకపోతే ఏం చేసినా వేస్టే. రోజు మొత్తంలో ఏం తినాలనుకుంటున్నారో ముందే ప్లాన్ చేసుకోండి. దీని వల్ల అప్పటికప్పుడు ఏదన్నా తినాలంటే చెత్త ఫుడ్స్ వైపు మన చేతులు వెళ్లకుండా ఉంటాయి. మీరు తినే తిండిలో 90% ఆకుకూరలు, గుడ్లు, చేపలు, పండ్లు, ఆలుగడ్డలు ఉండేలా చూసుకోండి. నాన్ వెజ్ తినలేని వారు వీగన్ ఫుడ్ డైట్ అలవాటు చేసుకోండి. మీరు ఓ మంచి న్యూట్రిషనిస్ట్‌ను కలిస్తే చక్కగా మీకు డైట్ ప్లాన్ రాసిస్తారు.
ఇక ఎక్సర్‌సైజ్ విషయానికొస్తే.. కార్డియో ఆల్రెడీ అనుకున్నాం కదా.. దానితో పాటు స్వ్కాట్స్, పుషప్స్, బెంచ ప్రెసెస్, పులప్స్ కూడా చేస్తూ ఉండండి. ఇవన్నీ సులువుగా ఇంట్లో చేసుకునేవే. ఒకవేళ వర్క్ ఫ్రం హోం చేస్తున్నట్లైతే రోజుకి 8000 అడుగులు నడుస్తున్నారో లేదో చూసుకోండి. ఇక్కడ మీరు బాగా గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే.. మీరు బరువు తగ్గడంలేదు అంటే దాని అర్థం ఎక్కువ కేలొరీలు ఉన్న ఫుడ్ తింటున్నారని. అంతేకానీ ఎక్కువ తింటున్నారని కాదు. కాబట్టి ఏం తిన్నా అందులో కేలొరీల శాతం ఎంత ఉందో చూసుకుని తినండి. మరో ముఖ్యమైన విషయం ఏంటంటే.. తిండి మానేస్తే బరువు తగ్గుతారు అనేది భ్రమ. తిండి తినకపోతే బ్లోటింగ్ సమస్యలు వచ్చి మరింత లావైపోతారు. కాబట్టి ఏం తింటున్నాం అనేది చాలా కీలకం.