Kidney Stones: ఈ సూపర్ ఫుడ్స్‌తో ఆ బాధ ఉండదు!
Kidney Stones: కిడ్నీల్లో రాళ్లు రాకుండా ఉండేందుకు కొన్ని సూపర్ ఫుడ్స్ ఉన్నాయి. ఈ సూపర్ ఫుడ్స్ తినడం వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా ఉండటమే కాదు మందులు లేకుండా కరిగిపోయే ఛాన్సులు కూడా ఉన్నాయట. ఇంతకీ అవేం ఆహారాలో తెలుసుకుందాం.
పుచ్చకాయ (watermelon)
పుచ్చకాయలో 99 శాతం నీరే ఉంటుంది. ఇందులో ఉండే పొటాషియం మూత్ర పిండాల్లో రాళ్లు ఏర్పడకుండా నివారిస్తుంది.
నిమ్మకాయ (lemon)
ఇందులో ఉండే సిట్రిక్ యాసిడ్ రాళ్లు ఏర్పడనివ్వకుండా రక్షణ కవచంలా ఉంటుందట.
బ్రొకోలీ (broccoli)
బ్రొకోలీ కాల్షియం ఆక్సోలేట్ ఎక్కువగా ఉంటుంది. ఇది కడుపులోని ఆక్సలేట్స్కు అతుక్కుని ఉంటుంది. దీని వల్ల కిడ్నీలో రాళ్లు ఏర్పడవు.
బెర్రీలు (berries)
అన్ని రకాల బెర్రీ పండ్లు కిడ్నీ ఆరోగ్యానికి ఎంతో మంచివి. ఎందుకంటే వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. బర్రీ జాతికి చెందిన ఏ పండ్లనైనా తినొచ్చు.
ఆలివ్ ఆయిల్ (olive oil)
కిడ్నీల్లో రాళ్లు ఏర్పడటానికి కారణం అయిన ఆక్సలేట్ లెవెల్స్‌ను ఆలివ్ ఆయిల్ గ్రహించేసుకుంటుంది. కాకపోతే ఆలివ్ ఆయిల్‌ను వంట చేసే సమయాల్లో నేరుగా వేడి చేయకూడదు.