Hot Water: వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారా? పెరుగుతారా?
Hot Water: వాతావరణం ఎలా ఉన్నా గోరువెచ్చని నీళ్లు తాగితే ఆరోగ్యానికి ఎంతో మంచిది అని చెప్తుంటారు. వేడి నీళ్లు తాగడం వల్ల బరువు పెరుగుతారని కొందరు.. లేదు లేదు తగ్గుతారని మరికొందరు సలహా ఇస్తుంటారు. అసలు వేడి నీళ్లు తాగితే కలిగే లాభాలేంటి? బరువు తగ్గుతారా? పెరుగుతారా? వంటి విషయాలను తెలుసుకుందాం.
ముందు మనం బరువు తగ్గే విషయం గురించి తెలుసుకుందాం. వేడి నీళ్లు తాగితే బరువు తగ్గుతారు అని కాదు కానీ.. మీకు ఎప్పుడైనా బేవరేజెస్ తాగాలనిపిస్తే.. అంటే కూల్‌డ్రింక్స్, హాట్ డ్రింక్స్ వంటివి తాగాలనిపిస్తే.. ఒక బాటిల్ వేడి నీళ్లు తాగేయండి. దాని వల్ల అసలు కేలొరీలు వెళ్లవు.. కడుపులో కదలికలు వచ్చి ఫ్రీగా మోషన్ కూడా అవుతుంది. ఇలా చేస్తే బరువు సులువుగా తగ్గుతారు. అంతేకానీ ఏది పడితే అది తినేసి వేడి నీళ్లు తాగితే తగ్గుతారు అని కాదు.
అదీకాకుండా చల్ల నీళ్లు తాగడంతో పోలిస్తే గోరువెచ్చని నీళ్ల వల్ల ఒంట్లోని ఫ్యాట్ మాలిక్యూల్స్ అంటే కొవ్వు అణువులు సులువుగా కరుగుతాయట. గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల కలిగే మరో ప్రయోజనం ఏంటంటే.. తిన్న ఆహారం నుంచి పోషకాలు బాగా ఒంటికి అందుతాయి. పొడిబారిన చర్మం ఉన్నవారు.. జీర్ణ సమస్యలు ఉన్నవారికి హాట్ వాటర్ బెస్ట్ ఆప్షన్ అని చెప్పచ్చు. మరిన్ని ప్రయోజనాలు పొందాలంటే.. ఉదయం లేవగానే ఒక గ్లాస్ వేడి నీళ్లు తాగి చూడండి. ఒంట్లో జరిగే మార్పులు మీకే తెలుస్తాయి. వేడి నీళ్లతో స్నానం చేస్తే రక్తపోటు కూడా తగ్గుతుంది.