టీ ఎప్పుడు తాగాలి? ICMR ఏం చెప్తోంది?

do you know the best time to consume tea

Tea: మూడ్ బాగున్నా బాలేక‌పోయినా మ‌నసుకు కాస్త ప్ర‌శాంత‌త‌ను క‌లిగించేది టీ. ఎండాకాలంలోనూ ప‌ద‌రా అలా చాయ్ తాగొద్దాం అనేవాళ్లు కోకొల్ల‌లు. కొంద‌రైతే ఎప్పుడు ప‌డితే అప్పుడు చాయ్ తాగేస్తుంటారు. అస‌లు టీ ఎప్పుడు తాగాలి? అనే విష‌యంపై ఇండియ‌న్ కౌన్సిల్ ఆఫ్‌ మెడిక‌ల్ రీసెర్చ్ ఓ క్లారిటీ ఇచ్చింది. అదేంటో చూద్దాం.

టీలో కెఫీన్ ఎక్కువ‌గా ఉంటుంది. ఈ కెఫీన్ ఎలాంటిదంటే.. ఒక్క‌సారి అల‌వాటు అయితే ఇక దానికి మ‌న శ‌రీరం అల‌వాటు ప‌డిపోతుంది. అప్పుడు టీ లేదా కాఫీ తాగ‌నిదే శ‌రీరం స‌హ‌క‌రించ‌దు. మ‌రో విష‌యం ఏంటంటే చాయ్‌లో ట్యానిక్ యాసిడ్ ఉంటుంది. ఇది ఒంట్లోని ఐర‌న్‌ను గ్ర‌హించేసుకుంటుంది. ఫలితంగా బాడీకి అందాల్సిన ఐర‌న్ అంద‌కుండాపోతుంది. దాని వ‌ల్ల ఐర‌న్ లోపిస్తుంది.

కాఫీ అయినా టీ అయినా లిమిట్‌లో తీసుకోవాలి. రోజుకి 300 మైక్రో గ్రాముల వ‌ర‌కు అయితే ఫ‌ర్వాలేదు. అంత‌కంటే ఎక్కువైతే ఎక్కువ‌గా కాఫీ తాగితే గుండె కొట్టుకునే వేగం పెరుగుతుంది. ఇది అస్స‌లు మంచిది కాదు. ఇక టీ, కాఫీ తిన‌డానికి గంట ముందు తీసుకోవాలే త‌ప్ప తిన్న వెంట‌నే కానీ తిన‌డానికి కొన్ని నిమిషాల ముందు కానీ అస్స‌లు సేవించ‌కూడ‌దు. మ‌రో విష‌యంపై ICMR తేల్చి చెప్పింది ఏంటంటే.. పాల‌తో చేసుకుని తాగే టీ కాఫీ కంటే గ్రీన్ టీ, బ్ల్యాక్ కాఫీ ది బెస్ట్ అని అంటోంది. ఒక‌సారి ప్ర‌య‌త్నించి చూడండి..!