Fruits తిన్నాక నీళ్లు తాగేస్తున్నారా?
Hyderabad: చాలా మంది ఏదన్నా తింటే వెంటనే నీళ్లు తాగేస్తుంటారు (fruits). ఏం తిన్నా కూడా ఒక అరగంట ఆగి తాగమంటారు కొందరు. తిన్న వెంటనే నీళ్లు తాగితే మంచిది అంటారు మరికొందరు. ఈ రెండు విషయాలు పక్కన పెడితే.. అసలు పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగితే ఏమవుతుంది?
పండ్లలో (fruits) చెక్కర శాతం ఎక్కువ ఉంటుంది. అందుకే పండ్లు తిన్నాక వెంటనే నీళ్లు తాగితే కడుపులోకి ఎసిడిటీ తగ్గిస్తుంది. కాకపోతే దీని వల్ల కడుపులో ఈస్ట్ (yeast) పేరుకుపోతుంది. ఈ ఈస్ట్ కడుపులో ఫామ్ అవ్వడం వల్ల పొత్తి కడుపులో నొప్పి పెడుతుంది. సాధారణ కడుపునొప్పి కంటే ఇది ఇంకా నొప్పిని కలిగిస్తుంది. ఎక్కువ నీటిశాతం ఉండే పండ్లు.. అంటే పుచ్చకాయ, తర్బూజ, నారింజ, స్ట్రాబెర్రీ లాంటివి తిన్నప్పుడు వెంటనే నీళ్లు తాగడం బెటర్. ఎందుకంటే ఇది ఒంట్లో PH లెవల్‌ను కంట్రోల్‌లో ఉంచుతుంది.
పండ్లు తిన్న వెంటనే నీళ్లు తాగేస్తే సరిగ్గా జీర్ణం అవ్వదు. దాంతో ఎసిడిటీ ఫామ్ అయిపోతుంది. రక్తంలో చెక్కర లెవెల్స్ పెరిగే ప్రమాదం కూడా ఉంది వెంటనే నీళ్లు తాగేస్తే. ఎందుకంటే పండ్లు (fruits) తిన్న వెంటనే నీళ్లు తాగేస్తే జీర్ణం కాదు. దాంతో చాలా మటుకు ఫుడ్ కడుపులో ఉండిపోతుంది. దాంతో డైజెస్ట్ అవ్వక అది ఫ్యాట్‌గా మారి ఇన్సులిన్‌లోకి కన్వర్ట్ అవుతుంది. దీని వల్లే డయాబెటిస్ వస్తుంది. అందుకే ఎప్పుడు పండ్లు తిన్నా.. ఒక గంట ఆగాక నీళ్లు తాగడం బెటర్.