Covid 19: కోవిడ్ సోకిన మగవారి వీర్య కణాల్లో చేరుతున్న వైరస్
Covid 19: కోవిడ్ సోకి కోలుకున్న మగ పేషెంట్లలో వైరస్ వీర్యకణాల్లో దాగి ఉంటోందని బ్రెజిల్‌కి చెందిన యూనివర్సిటీ ఆఫ్ సౌసౌలో చేసిన రీసెర్చ్‌లో తేలింది. కోవిడ్ వైరస్ నుంచి కోలుకున్నవారి వీర్యకణాల్లో దాదాపు 90 రోజుల పాటు ఈ వైరస్ ఉంటోంది. అంతేకాదు.. తొలిసారి వైరస్ సోకిన వారి వీర్యకణాల్లో 110 రోజుల పాటు ఈ వైరస్ ఆనవాళ్లు ఉంటున్నాయని తేలింది.
రియల్ టైం పీసీఆర్, ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోపీ పద్ధతుల ద్వారా కోవిడ్ సోకిన మగ పేషెంట్లపై రీసెర్చ్ చేసారు. రీసెర్చ్ ప్రకారం.. కోవిడ్ నుంచి కోలుకున్న దాదాపు 62% మంది మగవారి వీర్యకణాల్లో ఇంకా వైరస్ ఆనవాళ్లు ఉన్నాయి. ప్రతి 11 పేషెంట్లలోని 8 పేషెంట్లలో ఈ వైరస్ ఇంకా ఉంది. దీని వల్ల వీర్యకణాల క్వాలిటీపై తీవ్ర ప్రభావం చూపుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు. కాబట్టి.. ఒకవేళ లైంగిక చర్యలో పాల్గొనాలని అనుకునేవారు.. కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కనీసం ఆరు నెలల తర్వాత పాల్గొంటే మంచిదని హెచ్చరిస్తున్నారు. లేదంటే.. గర్భం దాల్చిన తర్వాత పుట్టబోయే పిల్లలు అంగ వైకల్యంతో పుట్టే అవకాశం లేకపోలేదట.