Apples: యాపిల్స్ తినడం వల్ల కలిగే నష్టాలివే..!
Apples: రోజుకో యాపిల్ పండు తింటే డాక్టర్ దగ్గరికి వెళ్లే అవసరం ఉండదు అని చెప్తుంటారు. కానీ ఒక్కోసారి ఆ యాపిల్ పండు తినడం వల్లే వైద్యుడి వద్దకు వెళ్లాల్సిన పరిస్థితి కూడా రావచ్చు. ఇదేదో భయపెట్టాలని కాదు కానీ.. మనం తినే ప్రతీ ఆహారానికి మంచి ఉంటుంది చెడూ ఉంటుంది. అవగాహన కోసమైనా కొన్ని విషయాలను మనం తెలుసుకుంటూ ఉండాలి.
ఇంతకీ యాపిల్స్ తినడం వల్ల కలిగే నష్టాలేంటి?
యాపిల్ పండులో విపరీతమైన పీచు ఉంటుంది. కానీ జీర్ణ సమస్యలు ఉన్నవారు యాపిల్స్ తింటే మాత్రం గ్యాస్ ఏర్పడుతుంది. కడుపు నొప్పి వంటి సమస్యలు వస్తాయి
యాపిల్ పండులో సహజంగా చెక్కర ఎక్కువ ఉంటుంది. కాబట్టి షుగర్ పేషెంట్లకు మంచిది కాదు.
యాపిల్ పండులో పీచు ఎక్కువగా ఉన్నప్పటికీ కేలొరీలు ఎక్కువే. అందుకే ఆల్రెడీ బరువు ఉన్నవారు.. బరువు తగ్గాలనుకునేవారు యాపిల్స్ జోలికి వెళ్లరు.
కొందరికి యాపిల్ పండ్ల వల్ల అలెర్జీలు వస్తుంటాయి. యాపిల్ పండు తిన్నాక దురదలు, వాపులు, దద్దుర్లు కనిపిస్తే వెంటనే వాటిని తినడం ఆపేయండి.
ఇలాంటి ఆరోగ్యపరమైన అంశాలపై మరింత అవగాహన పెంచుకునేందుకు వైద్యులను సంప్రదించడం మరీ మంచిది.