Health: ఈ బ్లడ్ టెస్ట్‌లు తప్పకుండా చేయించుకోవాలి
Health: చుక్క రక్తంతో ఒంట్లోని అనారోగ్య సమస్యలన్నీ బయటపడతాయి. ఏడాదికి ఒకసారైనా ఆరు రకాల రక్త పరీక్షలు తప్పకుండా చేయించుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. ఒకవేళ మీకు రక్తపోటు, డయాబెటిస్ వంటి సమస్యలు ఉంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి పరీక్షలు చేయించుకోవాలి. ప్రతి ఒక్కరూ సంవత్సరానికి ఒకసారైనా ఈ 6 రక్త పరీక్షలు మాత్రం తప్పకుండా చేయించుకోవాలట. అవేంటంటే..
కంప్లీట్ బ్లడ్ కౌంట్ (CBC)
ఈ పరీక్ష వల్ల ఒంట్లో ఎర్ర, తెల్ల రక్త కణాలు ఏ సంఖ్యలో ఉన్నాయో తెలుస్తుంది. ఎనీమియా, బ్లడ్ క్యాన్సర్ వంటి రోగాలు కూడా బయటపడతాయి.
మెటబాలిక్ ప్యానెల్
ఒంట్లోని గ్లూకోజ్ లెవెల్స్ చెక్ చేసేందుకు ఈ మెటబాలిక్ ప్యానెల్ టెస్ట్ ఉపయోగపడుతుంది. కిడ్నీ, లివర్ ఎలా పనిచేస్తున్నాయో కూడా చెప్పేస్తుంది. అధిక బాడీ మాస్ ఇండెక్స్ (BMI) ఉన్నవారికి ఈ టెస్ట్ ఎక్కువగా చేస్తుంటారు.
లిపిడ్ ప్రొఫైల్
ఈ పరీక్ష చేయించుకోవాలంటే ఏమీ తినకుండా వెళ్లాలి. ఒంట్లోని కొలెస్ట్రాల్, గుండెపోటుకు దారి తీసే ట్రైగ్లిసరైడ్స్ లెవెల్స్ ఎంత వరకు ఉన్నాయో లిపిడ్ ప్రొఫైల్ చెప్పేస్తుంది.
కార్డియాక్ బయోమార్కర్స్
ఒంట్లోని ఎన్జైమ్ లెవెల్స్‌ని తెలియజేస్తుంది. ఫలితంగా గుండె పనితీరుపై ఎలాంటి ప్రభావమైనా చూపుతోందా లేదా అని తెలుస్తుంది.
థైరాయిడ్ లెవెల్స్
ఈ టెస్ట్ వల్ల థైరాయిడ్ గ్రంథి హైపర్ యాక్టివిటీలో ఉందా లేదా అండర్ యాక్టివిటీలో ఉందా అనేది తెలుస్తుంది.