Hot Water: లేవగానే వేడి నీళ్లు తాగుతున్నారా?
Hyderabad: ఉదయం లేవగానే ఒక గ్లాసు వేడి నీళ్లు తాగితే కలిగే లాభాలు ఎన్నో. అసలే వర్షాకాలం. కాబట్టి హాట్ వాటర్ తాగడం ఇంకా మంచిది. అసలు పొద్దున్నే వేడి నీళ్లు తాగడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం. (hot water)
బరువు తగ్గుతారు
ఉదయాన్నే ఓ గ్లాసు వేడి నీళ్లు (hot water) తాగడం వల్ల బరువు తగ్గుతారని ఓ రీసెర్చ్‌లో తేలింది. ఎందుకంటే నార్మల్‌గానే నీళ్లు తాగితే పొట్ట నిండిపోయినట్లుగా ఉంటుంది. వెంటనే ఆకలి వెయ్యదు.
మలబద్ధకం పోతుంది
ఇది చాలా మందికి ఉండే సమస్యే. కడుపు క్లీన్‌గా లేకపోతే ఎంత మంచి ఫుడ్ తిన్నా, ఎంతగా ఎక్సర్‌సైజ్ చేసినా ఏం లాభం ఉండదు. ఉదయాన్నే వేడి నీళ్లు తాగడం వల్ల కడుపు తేలిక అవుతుంది. వెంటనే మోషన్ ఈజీగా అవుతుంది. (hot water)
డీటాక్సిఫికేషన్
వేడి నీళ్లు తాగేవారిలో త్వరగా చెమటలు పడతాయి. చెమట ద్వారా చర్మంపై ఉండే పోర్స్ నుంచి మలినాలు పోతాయి.
రక్తప్రసరణ బాగుంటుంది
హాట్ వాటర్ రక్తనాళాలను డైలేట్ చేస్తుందట. దాని వల్ల శరీరమంతా రక్తప్రసరణ బాగా జరుగుతుంది. తద్వారా కండరాల నొప్పులు కూడా తగ్గిపోతాయి.
ఒత్తిడి తగ్గుతుంది
మీకు ఏదైనా పని వల్ల ఒత్తిడిగా ఉందనుకోండి.. ఒక కప్పు వేడి నీళ్లు కానీ లేదా కాఫీ టీ కానీ తాగి చూడండి. వెంటనే రిలీఫ్ ఉంటుంది.