Pot Water: కుండ‌లో నీరు తాగుతున్నారా?

Hyderabad: పాత‌కాలంలో కుండ‌ల్లో పోసిన నీరు తాగేవారు. అందులో నీళ్లు పోసి ఉంచితే నిమిషాల్లోనే చ‌ల్ల‌గా అవుతాయి. ఇప్పుడు ప‌ట్టణాల్లో కూడా ఎండాకాలం వ‌చ్చిందంటే కుండ‌ల‌కు ఉండే గిరాకీనే వేరు. కుండ‌లో నీళ్లు పోసుకుని తాగ‌డం వ‌ల్ల ఉప‌యోగాలు ఉన్నాయా? చూద్దాం. (pot water)

*కుండ‌లో నీరుపోసి ఉంచ‌డం ద్వారా అందులో ఉండే మ‌లినాలు తొల‌గిపోతాయ‌ట‌. ఆ నీళ్లు తాగితే మెట‌బాలిజం బూస్ట్ అయ్యి, త్వ‌ర‌గా జీర్ణ‌మ‌వుతుంద‌ట‌.

*ఎండాకాలంలో ఫ్రిజ్‌లోని నీళ్లు తాగే బ‌దులు కుండ‌ల్లో పోసుకుని తాగితే కొన్ని అనారోగ్య స‌మ‌స్య‌లు రావు. (pot water)

*ఎండాకాలంలో కుండలో పోసిన నీళ్లు తాగితే వ‌డ‌దెబ్బ త‌గ‌ల‌కుండా ఉంటుంద‌ట‌.

*కుండ నేచుర‌ల్ ప్యూరిఫైయ‌ర్‌గా ప‌నిచేస్తుంది. కాక‌పోతే కుండ‌లో పోసేముందు దానిని శుభ్రంగా క‌డ‌గాలి. (pot water)

*కాలంతో సంబంధం లేకుండా కుండ‌లో పోసిన నీళ్లు తాగితే గ్యాస్ట్రిక్, ఎసిడిటీ స‌మ‌స్య‌లు రావ‌ట‌.