Bhupendra Patel: ఇక ప్రేమ పెళ్లిళ్ల‌కీ చ‌ట్టం..!

Gujarat: ప్రేమ పెళ్లిళ్ల‌పై ఓ చ‌ట్టం తీసుకురావాల‌ని అంటున్నారు గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి భూపేంద్ర ప‌టేల్ (bhupendra patel). ప్రేమ వివాహాలు చేసుకోవాలంటే తల్లితండ్రుల అనుమతి తప్పనిసరిగా ఉండేలా చట్టాలు తీసుకురావడానికి పరిశీలిస్తున్న‌ట్లు తెలిపారు. అగ్ర కులాల నుంచి ఈ డిమాండ్ అధికంగా వినిపిస్తోంద‌ని అన్నారు. ఆదివారం పాటిదర్ అనే అగ్ర కుల వ‌ర్గానికి చెందిన ఓ ఈవెంట్‌లో భూపేంద్ర ప‌టేల్ పాల్గొన్నారు. ఈ మ‌ధ్య‌కాలంలో గుజ‌రాత్‌కు (gujarat) చెందిన అమ్మాయిల్లో కొంద‌రు ప్రేమించిన‌వాడి కోసం ఇంట్లో చెప్ప‌కుండా పారిపోతున్నార‌ని, ఇలాంటివి జ‌ర‌గ‌కుండా ఉండేందుకు ఇంట్లో వారు ఒప్పుకుంటేనే ప్రేమ పెళ్లి అనే చ‌ట్టాన్ని తీసుకురావాల‌ని అన్నారు. అయితే ప్రేమ పెళ్లిళ్ల‌కు త‌ల్లితండ్రులు ఒప్పుకోక‌పోయినా వారి కోసం కూడా ఓ చ‌ట్టం ఉంటుంద‌ని అన్నారు. ఇరువైపుల అంశాల‌ను ప‌రిశీలించాకే ఓ బిల్లును పార్ల‌మెంట్‌లో ప్ర‌వేశ‌పెడ‌తామ‌ని వెల్ల‌డించారు.